పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో ఆయన చేసే సినిమాలు కాదు.. ఆయన తీసుకునే పారితోషకమే డిసైడ్ చేస్తుంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ అందుకునే పారితోషకం తెలుగులో మరొక హీరో అందుకునేవారే లేరు. ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తూ భారీ సినిమాల్లో నటిస్తూ పారితోషకం అందుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు.. జస్ట్ ఒక్కరోజులో తెలుగు లాంగ్వేజ్ మాత్రమే చేస్తూ రెండు మూడు కోట్లు సంపాదించగల క్రేజ్ ఉన్న హీరో.
దీనిని బట్టే టాలీవుడ్ నెంబర్ 1 హీరో డిసైడ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు చేసారు, ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయి అని ఏ నిర్మాతా పట్టించుకోరు. తమ బ్యానర్ లో పవన్ నటిస్తే చాలు అన్నట్టుగా ఆయనకి ఎంత కావాలంటే అంత, ఎంత అడిగితే అంత ఇచ్చేస్తారు. అందుకే అయన క్రేజ్ ని ఆయనే వాడుకుంటున్నారు. ఆయన సినిమాల్లో సంపాదించిన డబ్బుని రాజకీయాల్లో పెడుతున్నారు. అదే పవన్ కళ్యాణ్ చెబుతున్న మాట, తనకేమి దొంగ వ్యాపారాలు లేవు, అడ్డదిడ్డంగా బిజినెస్ ల్లో సంపాదించి పోగెయ్యడం లేదు.. నిజయితీగా పని చేసి సంపాదిస్తున్నా అని చెబుతారు.
తాజాగా జనసేన ఫార్మేషన్ డే రోజున పవన్ కళ్యాణ్ తన పారితోషకాన్ని రివీల్ చేసి షాకిచ్చారు. తాను సాయి తేజ్ తో కలిసి చేస్తున్న సముద్రఖని మూవీకి రోజు రెండు కోట్లు తీసుకుంటున్నాను, 20 రోజులకి 40 కోట్ల పారితోషకం అందుకుంటున్నట్టుగా బహిరంగంగా ప్రకటించారు. అక్కడే ఆయన రేంజ్ రివీల్ అయ్యింది. కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ నిజాయితీని శంకిస్తూ.. ఐటీ వారు వింటున్నారా పవన్ కళ్యాణ్ రోజుకి రెండు కోట్లు సంపాదిస్తున్నాడట అంటూ ఎగతాళి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ గతంలో కూడా చెప్పారు. పన్నులు చెల్లిస్తాను, ఎవరికీ ప్రశ్నించే అవకాశం ఇవ్వను అని. మరి బహిరంగంగా అలా చెప్పిన పవన్ కళ్యాణ్ ఐటీ లెక్కలు చూపకుండా ఉంటారు. సరే అదంతా అలా ఉండనివ్వండి.. ఇప్పుడు ఈ రేంజ్ లో రోజుకి రెండు కోట్లని అందుకునే హీరోల్లో తెలుగులో ఇంకెవరున్నారో(జస్ట్ తెలుగు సినిమాల్లో మాత్రమే) చెప్పండి అంటూ పవన్ ఫాన్స్ ఛాలెంజ్ చేస్తున్నారు.