రామ్ చరణ్-ఉపాసనలు ప్రస్తుతం అమెరికాలోని ఆస్కార్ అవార్డులలో పాల్గొని అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. భర్తతో తోడుగా ఉండేందుకు ఉపాసన కూడా అమెరికా వెళ్ళింది. అక్కడ ఆస్కార్ కోసం బయలుదేరేందుకు చక్కగా సారీ లో ఉపాసన, రామ్ చరణ్ స్టైలిష్ గా రెడీ అయ్యి వచ్చారు. వాళ్లిద్దరూ ఆస్కార్ కి వెళుతూ హాలీవుడ్ మీడియాతో తమకు పుట్టబోయే బిడ్డ అదృష్టం గురించి మాట్లాడారు. ఉపాసనకు ఇప్పుడు ఆరోనెల అంటూ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.
అయితే రామ్ చరణ్ ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతాడు. ఎప్పుడు చూసినా రామ్ చరణ్ అయ్యప్ప మాలలోనే ఉంటాడు. ఆధ్యాత్మికతతో దేవుణ్ణి కొలుస్తాడు. అమెరికాకి వెళ్లేముందు చరణ్ మాలలోనే ఉన్నాడు. అక్కడికి వెళ్ళాక 21 రోజులు దీక్ష పూర్తవడంతో అక్కడే ఉన్న ఓ గుడిలో తన దీక్ష విరమించాడు. అంత భక్తి ఉన్న చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఆస్కార్ కి వెళ్లేముందు కూడా దేవుణ్ణి భక్తితో కొలవడం హాట్ టాపిక్ అయ్యింది.
ఆస్కార్ కి చరణ్-ఉపాసన వెళ్లేముందు పూజ చేస్తున్న పిక్స్ వైరల్ గా మారాయి. దాని గురించి రామ్ చరణ్ మట్లాడుతూ నేను నా భార్య ఉపాసన ఎక్కడికి వెళ్లినా చిన్న గుడిని ఏర్పాటు చేసుకుని పూజిస్తాం. అది మా ఆచారంతో పాటుగా భారతదేశ సంప్రదాయాన్ని ఉట్టిపడేలా చేస్తుంది. ప్రతి రోజుని కృతజ్ఞతలు చెబుతూ మొదలు పెట్టడం ప్రతి ఒక్కరికి ముఖ్యం. మాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నామంటూ రామ్ చరణ్ తన భక్తి గురించి తెలియజేసాడు.