ప్రతి వారం థియేటర్స్ లో ఏ కొత్త సినిమా విడుదలవుతుందా అని సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, స్టూడెంట్స్, యూత్ అంతా ఎదురు చూస్తే.. ఫ్యామిలీ ఆడియన్స్, ఓటిటి వీక్షకులు మాత్రం వారం వారం ఏ ఏ ఓటిటీల నుండి ఏయే సినిమాలు విడుదలవుతున్నాయి అనే లిస్ట్ ని సెర్చ్ చేస్తారు. సరదాగా ఇంట్లోనే కూర్చుకుని కొత్త సినిమాలు థియేటర్స్ లో విడుదలైన నెలరోజులకే ఓటిటిలో చూసేయ్యొచ్చు అనేది వాళ్ళ ఆశ. అందుకే ప్రతి వారం విడుదలయ్యే సినిమాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో ఆ లిస్ట్ లు చక్కర్లు కొడుతూ ఉంటాయి.
ఈ వారం థియేటర్స్ లో నాగ శౌర్య ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి రిలీజ్ అవుతుంటే.. పలు చిత్రాలు ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి
అందులో ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్‌లో నటించిన సార్ మూవీ ఫిబ్రవరి 17న విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సార్ మార్చ్ 17 న ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది..
టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హిట్ చిత్రం రైటర్ పద్మభూషణ్ ఫిబ్రవరి 3వ తేదీన విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ నెల 17 నుంచి ప్రీమియర్ కానుంది. ఆహా ఓటిటి నుండి సత్తిగాని రెండెకరాలు వీటితో పాటుగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ వెబ్ సీరీస్ లు కూడా కొన్ని ఓటిటీల నుండి అందుబాటులోకి రానున్నాయి.