Advertisementt

ఆసుపత్రిలో అషు రెడ్డి?

Tue 14th Mar 2023 06:24 PM
ashu reddy  ఆసుపత్రిలో అషు రెడ్డి?
Ashu Reddy hospitalised ఆసుపత్రిలో అషు రెడ్డి?
Advertisement
Ads by CJ

అషు రెడ్డి అంటే జూనియర్ సమంతలా గతంలో పేరు తెచ్చుకున్నా ఇప్పుడు గ్లామర్ షో విషయంలో అషు రెడ్డి పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న అషు రెడ్డి రాహుల్ సిప్లిగంజ్ ని వివాహం చేసుకుంటుంది అనే ప్రచారం ఉంది. కానీ వీరిద్దరూ ప్రొఫెషనల్ గా మాత్రమే ఫ్రెండ్స్ మని చెబుతూ ఉంటారు. అయినా హద్దులు దాటి ఫోటో షూట్స్, వెకేషన్స్ కి వెళ్లే వాళ్లిద్దరూ ఈ మధ్యనే ఓ ఆల్బమ్ కోసం కలిసి దుబాయ్ వెళ్లివచ్చారు.

ఇక సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్స్ తో భీబత్సం చేసే అషు రెడ్డి ఆసుపత్రి పాలైనట్లుగా ఓ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం చూసి ఆమెకి ఏమైందో అనే ఆందోళనలోకి ఫాన్స్ ఉన్నారు. తరుచూ ప్రయాణాలు చేస్తూ, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ గ్లామర్ గా ఆకట్టుకునే అషు రెడ్డి ఇలా ఉన్నట్టుండి హాస్పిటల్ పాలవడం ఆమె అభిమానులకి అర్ధం కావడం లేదు. అభిమానులు ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 

మరి నిజంగా అషు రెడ్డి హాస్పిటల్ పిక్ లో చేతికి సెలైన్స్ బాటిల్ పెట్టి ఉండగా.. ఆమె నీరసంగా కనిపిస్తుంది. అసలు అషూ రెడ్డి అనారోగ్యం ఏమిటో ఆమెకి ఏ సమస్య వచ్చిందో మాత్రం తెలియరాలేదు.. కానీ ఆ పిక్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అసలు ఇది నిజామా.. లేదంటే అషు ఏదైనా ఫ్రాంక్ చేస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Ashu Reddy hospitalised:

Ashu Reddy in Hospital

Tags:   ASHU REDDY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ