అల్లు అర్జున్ సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత పుష్ప ద రూల్ లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ వైజాగ్ లో పూర్తి చేసుకుని. తర్వాత అల్లు ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్ కి వెళ్ళాడు. తల్లితండ్రులు, అన్న వదినలు, భార్య అలాగే తమ్ముడు శిరీష్ తో కలిసి అల్లు అర్జున్ దుబాయ్ లో ఎంజాయ్ చేసి వచ్చాడు. రీసెంట్ గానే పుష్ప షూటింగ్ హైదరాబాద్ ఎర్రమంజిల్ లో జరిగింది. ఎర్రమంజిల్ లో నైట్ షూట్ చేపట్టిన సుకుమార్.. ఆ షెడ్యూల్ చిత్రీకరిస్తున్నారు. అయితే పుష్ప షూటింగ్ నుండి చిన్న గ్యాప్ రావడంతో.. అటు పిల్లలకి వేసవి సెలవలు మొదలు కావడంతో అల్లుని అర్జున్ తన భార్య పిల్లలని తీసుకుని రాజస్థాన్ చెక్కేసాడు.
షార్ట్ ట్రిప్ అంటూ రాజస్థాన్ ఫోర్ట్, అక్కడి జైపూర్ కోటలో అల్లు అర్జున్ తన భార్య స్నేహ ఇంకా పిల్లలు ఆయన్, అర్హ లతో కలిసి ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేయ్యగా అవి వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహాలు ట్రెండీ లుక్ లో స్టయిల్ గా కనిపించగా.. పిల్లలు కూడా క్రేజీగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఉన్నాయి ఆ పిక్స్.
ఇక అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 షూటింగ్ కంప్లీట్ అవ్వగానే.. సందీప్ వంగాతో బాలీవుడ్ నిర్మాతలతో కలిసి పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టబోతున్నాడు. ఈ మధ్యనే సందీప్ వంగాతో సినిమాని ప్రకటించి అల్లు ఫాన్స్ కి బన్నీ సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే.