Advertisementt

అందుకే RRR నిర్మాతని దూరం పెట్టారా?

Tue 14th Mar 2023 12:05 PM
rrr movie,dvv danayya  అందుకే RRR నిర్మాతని దూరం పెట్టారా?
Thats why the producer of R.R.R. was distanced? అందుకే RRR నిర్మాతని దూరం పెట్టారా?
Advertisement
Ads by CJ

దేశం మొత్తం ఆర్.ఆర్.ఆర్ కొచ్చిన ఆస్కార్ ని పొగుడుతుంటే.. ఆర్.ఆర్.ఆర్ టీమ్ మొత్తం హాలివుడ్ లో ఆస్కార్ సెలెబ్రేషన్స్ లో పాల్గొని ఉప్పొంగిపోతూ సందడి చేస్తుంటే.. ఆ సినిమాని 100ల కోట్ల  బడ్జెట్ తో నిర్మించిన దానయ్యని ఎవరూ పట్టించుకోకపోవడం నిజంగా ఆశ్చర్యమే. ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వచ్చిన సందర్భంగా అయన ఛానల్స్ లో స్పందిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసారు తప్పితే.. ఆ సినిమాని నిర్మించిన వాడై ఉండి.. ఇలా సైలెంట్ గా ఉండడం, అలాగే ఆయన పేరుని పెద్దగా ఎవరూ పలకకపోవడం నిజంగా అందరిని బాధపెట్టే విషయమే.

అయితే ఆర్.ఆర్.ఆర్ టీమ్ మొత్తంలో దానయ్యని దూరం పెట్టడానికి కారణం వినిపిస్తుంది. అదేమిటంటే ఆర్.ఆర్.ఆర్ ని ఆస్కార్ కి తీసుకెళ్లే విషయంలో దానయ్య ఏమి పట్టించుకోకపోవడంతో రాజమౌళి కొడుకు కార్తికేయ అమెరికాలోనే ఉండి అక్కడ హాలీవుడ్ మీడియాతోనూ, అలాగే ఆస్కార్ నామినేషన్స్ లోకి ఆర్.ఆర్.ఆర్ వెళ్లేలా ఏజెన్సిస్ తో మాట్లాడంలోనూ చూపించిన చొరవ, అయిన ఖర్చు, ఆ కష్టానికి ప్రతిఫలంగానే ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ వచ్చింది.

కానీ ఇందులో దానయ్య ఎలాంటి హెల్ప్ చెయ్యకపోవడంతోనే ఆర్.ఆర్.ఆర్ టీమ్ దానయ్యని పక్కనపెట్టేసింది అనే న్యూస్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఖర్చు విషయంలోనే ఆయన్ని సైడ్ చేసినట్లుగా తెలుస్తుంది. దానయ్య కూడా ఆస్కార్ కోసం అంత ఖర్చు పెడితే.. తనకి ఏమి లాభం ఉండదు అనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ విషయంలో కామ్ గా ఉండిపోయి తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టినట్లుగా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్ లు చూస్తే నిజమే అనిపించకమానదు.

Thats why the producer of R.R.R. was distanced?:

RRR Movie Producer DVV Danayya Reaction on Oscar Award

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ