Advertisementt

అనసూయ పారితోషకం చూస్తే దిమ్మతిరుగుద్ది

Tue 14th Mar 2023 09:52 AM
anasuya s,pan india films  అనసూయ పారితోషకం చూస్తే దిమ్మతిరుగుద్ది
Anasuya remuneration details అనసూయ పారితోషకం చూస్తే దిమ్మతిరుగుద్ది
Advertisement
Ads by CJ

యాంకర్ అనసూయ ఇప్పుడు కేరెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయ్యింది. గతంలో హీరోయిన్ అవకాశాలు కోసం వెయిట్ చేసినా.. ఆమెకి లేడీ ఓరియెంటెడ్ కథలే వచ్చాయి కానీ.. స్పెషల్ గా హీరోయిన్ పాత్రలు రాకపోవడంతో ఇప్పుడు ఎక్కువగా కథని మలుపు తిప్పే పాత్రల్లో కనిపిస్తుంది. అంతేకాదు.. పాన్ ఇండియా ఫిలిం పుష్ప సక్సెస్ తర్వాత అనసూయకి ఎక్కువగా పాన్ ఇండియా అవకాశాలే వస్తున్నాయి. ఈ మధ్యన ఆమెకి మైఖేల్ లాంటి గట్టి షాక్ లే తగిలాయి కానీ.. ఆమె రేంజ్ మాత్రం తగ్గలేదు.

ఇప్పుడు పుష్ప 2 లో అనసూయ కీ రోల్ పోషిస్తుంది అనే టాక్ ఉండగా.. జబర్దస్త్ నుండి జంప్ అయ్యాక అనసూయ పారితోషకం కూడా అమాంతం పెంచేసిందట. రోజుకి లక్షన్నర నుండి రెండు లక్షలు తీసుకునే అనసూయ రోజుకి మూడు లక్షలు డిమాండ్ చేస్తుందట. అనసూయ డిమాండ్ కి మేకర్స్ ఆమె కున్న బిజీ షెడ్యూల్స్, అలాగే ఆమె క్రేజ్ దృష్యా ఆమెకి అడిగిన పారితోషకం  ఇస్తున్నారని తెలుస్తుంది. అంటే నెలలో ఎన్ని కాల్షీట్స్ అంటే అన్ని మూడు లక్షలన్నమాట. ఒక్క పది రోజులు గట్టిగా పని చేస్తే చాలు అనసూయకి 30 లక్షలు వచ్చేస్తాయి.

జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులర్ అయిన అనసూయ ఇప్పుడు వెండితెర అవకాశాల కోసం ఆ జబర్దస్త్ నే పక్కనేబెట్టేసింది. అయినా అనసూయ రెండు చేతులా సంపాదిస్తుంది. ఆల్మోస్ట్ అనసూయ బుల్లితెరకి దూరంగా సిల్వర్ స్క్రీన్ కి దగ్గరగా ఉండడమే ఆమె పారితోషకం అంతగా పెరగడానికి కారణం అంటున్నారు.

Anasuya remuneration details:

Anasuya shocking remuneration for pan india films

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ