Advertisementt

బ్లాక్ సారీలో కత్తిలా ఉన్న కీర్తి సురేష్

Mon 13th Mar 2023 08:24 PM
keerthy suresh  బ్లాక్ సారీలో కత్తిలా ఉన్న కీర్తి సురేష్
Keerthy Suresh in black saree బ్లాక్ సారీలో కత్తిలా ఉన్న కీర్తి సురేష్
Advertisement
Ads by CJ

కీర్తి సురేష్ ని లావుగా ఉంటే లావుగా ఉంది అంటారు.. సరే బాగా కష్టపడి వర్కౌట్స్, యోగ చేసి బరువు తగ్గి సన్నగా మారిపోతే.. అయ్యో కీర్తి సురేష్ మొహంలో కళే లేదు అంటూ సాగదీస్తారు. అయినప్పటికీ కీర్తి సురేష్ మహానటి బరువుని తగ్గించుకోవడానికి నానా కష్టాలు పడి మళ్ళీ సినిమాల్లో, అందులోను స్టార్ హీరోల అవకాశాలతో సినిమాల్లో బిజీ అయ్యింది. కీర్తి సురేష్ ప్రస్తుతం నానితో దసరా మూవీ రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.

నానితో కలిసి హైదరాబాద్, చెన్నై, ముంబై, కోయంబత్తూర్ అంటూ దసరా ప్రమోషన్స్ లో హడావిడి చెయ్యడమే కాదు.. సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి క్రియేట్ చేసేలా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో డాన్స్ చేస్తూ నానిని ఆటపట్టిస్తున్న వీడియోస్ ని షేర్ చేస్తుంది. ఆ సాంగ్ లో డాన్స్ చెయ్యడానికి  కీర్తి సురేష్ బ్లాక్ సారీ కట్టింది. ఆ శారీలో నిజంగా కీర్తి మెరిసిపోయింది. ఆ సారీలో కత్తిలాంటి గ్లామర్ షో చేసింది.

బ్లాక్ సారీ లో బ్లాక్ అండ్ వైట్ లుక్ లో చురకత్తుల్లాంటి చూపుతో కీర్తి గ్లామర్ అద్భుతంగా కనిపించింది. మొహంలో కళ, ఫేస్ లో బ్రైట్ నెస్ అన్ని స్పష్టంగా కనిపించగా.. కీర్తి సురేష్ అందానికి ఆమె చూపులకి ఫిదా అవుతున్నారు.

Keerthy Suresh in black saree:

Keerthy Suresh looks like a sword in a black saree

Tags:   KEERTHY SURESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ