Advertisementt

సంక్రాంతికి డేట్ ప్రకటిస్తారా?

Mon 13th Mar 2023 07:33 PM
rc 15,ram charan  సంక్రాంతికి డేట్ ప్రకటిస్తారా?
Will you announce the date for Sankranti? సంక్రాంతికి డేట్ ప్రకటిస్తారా?
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు పాటకి ఆస్కార్ రావడంతో అందులో నర్తించిన రామ్ చరణ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. దానితో ఆయన నటిస్తున్న శంకర్ మూవీ RC15 పై అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. RC15 షూటింగ్ మొదలు పెట్టి ఏడాదిన్నర అయినా ఇంతవరకు టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ కానీ విడుదల చెయ్యకుండా దిల్ రాజు-శంకర్ లు గమ్మున ఉన్నారు. అయితే  ఈనెల 27 రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా RC15 లుక్ అండ్ టైటిల్ అనౌన్సమెంట్ ఉండబోతున్నట్లుగా దిల్ రాజు చెప్పారు.

చరణ్ బర్త్ డే కి ఒకరోజు ముందే అంటే మార్చి 26 సాయంత్రమే రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ రివీల్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే బర్త్ డే రోజు రామ్ చరణ్ లుక్ వదులుతారట. అయితే చరణ్ బర్త్ డే కే శంకర్ అండ్ దిల్ రాజులు RC15 రిలీజ్ డేట్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. 2024 సంక్రాంతికి RC15 రిలీజ్ ఉంటుంది అని.. అఫీషియల్ గా రిలీజ్ డేట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది.

అయితే రామ్ చరణ్ బర్త్ డే కి RC15 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అయితే పక్కా కానీ.. రిలీజ్ డేట్ విషయంలోనే అనుమానాలున్నాయి. ఇప్పుడే రిలీజ్ డేట్ ఇస్తారో.. లేదంటే ఇంకా రెండు నెలలు పోయాక రిలీజ్ డేట్ ఇస్తారో అని మెగా ఫాన్స్ అనుమానపడుతున్నారు.

Will you announce the date for Sankranti?:

RC 15: Title and first look of Ram Charan film to be released 

Tags:   RC 15, RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ