తెలుగు హృదయాలను ఆనందంతో పరవశింపజేసిన ఆర్.ఆర్.ఆర్ లోని నాటు నాటు పాటకి ఆస్కార్ రావడం.. ఆ టీమ్ కే కాదు.. ప్రతి భారతీయుడికి గొప్ప విషయమే. తెలుగువాడు గర్వంగా తలగరేసి.. మీసం మెలేసే సమయం. ఆస్కార్ వేదికపై బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్.ఆర్.ఆర్ కి అవార్డు అని ప్రకటించిన మరుక్షణమే తెలుగోళ్ళకి గూస్ బమ్ప్స్ వచ్చేసాయి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి-లిరికిస్ట్ చంద్రబోస్ లు చెయ్యి చెయ్యి పట్టుకుని ఆనందంతో ఆస్కార్ స్టేజ్ ఎక్కి అవార్డు అందుకున్నారు.
అవార్డు అందుకున్న వెంటనే కీరవాణి పాటందుకుని తన చిన్నప్పుడు తాను కార్పెంటర్స్ మ్యూజిక్ వినేవాడిని, ఇప్పుడు ఇక్కడ ఆస్కార్ అవార్డు అందుకున్నాను అంటూ ఆ సాంగ్ లో తన ఫ్యామిలీని కూడా పొగుడుతూ ఆనందాన్ని వ్యక్తపరచగా.. చంద్రబోస్ మాత్రం ఆస్కార్ వచ్చిన ఎగ్జైట్మెంట్ లో నమస్తే అని సింగిల్ వర్డ్ తోనే మరోసారి తెలుగోడు గొప్పదనాన్ని గుర్తు చేస్తూ స్టేజ్ దిగేసారు. ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ ప్రకటించిన ఆ ఐదు నిముషాలు భారతీయలు ఈ ప్రపంచాన్నే మరిచిపోయి ఆర్.ఆర్.ఆర్ ని పొగుడుకుంటూ ఉండిపోయారంటే నమ్మాలి.
రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ నాటు నాటు సాంగ్ లైవ్ పెరఫామెన్స్, రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన సందడి. రాజమౌళి ఫ్యామిలీ ఆనందభరిత క్షణాలను ఛానల్స్ లో సోషల్ మీడియాలో వీక్షిస్తూ ఇంకా ఇంకా అదే ఆనందంలోనే మునిగితేలుతున్నారు.