Advertisementt

రెబల్‌స్టార్ చిరకాల స్వప్నం నెరవేరింది

Sun 19th Mar 2023 12:05 PM
shyamala devi,krishnam raju,dream,rrr movie,oscar award,rajamouli,mm keeravani  రెబల్‌స్టార్ చిరకాల స్వప్నం నెరవేరింది
It is the Krishnam Raju Dream Says His wife Shyamala Devi రెబల్‌స్టార్ చిరకాల స్వప్నం నెరవేరింది
Advertisement
Ads by CJ

ఆస్కార్స్ విషయంలో రెబల్ స్టార్ కృష్ణంరాజుగారి చిరకాల స్వప్నం నెరవేరిందని అన్నారు ఆయన సతీమణి శ్యామలాదేవి. రాజమౌళిగారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’ ఆస్కార్ నామినేషన్ అందుకోవడమే కాదు, సినిమాలోని ‘నాటు నాటు’ ఆస్కార్ అందుకోవడం తెలుగు వారందరికీ గర్వకారణం. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట అవార్డు గెలుచుకోవడం, ఆస్కార్ వేదికపై కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకోవడం చూస్తుంటే నాకు కృష్ణంరాజుగారు చెప్పిన మాటలే గుర్తు వచ్చాయి. 

ఆయన ఎప్పుడూ తెలుగు సినిమాకి ఆస్కార్ రావాలని చాలా బలంగా కోరుకుంటూ ఉండేవారు.. ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత ఈ సినిమాకి అనేక అవార్డులు వస్తాయని ఆయన ముందే ఊహించారు. అలాంటి కృష్ణంరాజు గారి బలమైన కోరికను రాజమౌళి అండ్ టీం నెరవేర్చింది. ఈ సినిమా చేసిన రాజమౌళి గారికి, నిర్మాత దానయ్య గారికి శుభాభినందనలు. ఈ నాటు నాటు సాంగ్ మ్యూజిక్ అందించిన కీరవాణి గారికి, సాహిత్యం అందించిన చంద్రబోస్, పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరికీ కంగ్రాట్యులేషన్స్. ఈ సాంగ్‌కి స్టెప్పులు వేసిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.. వారి చేత స్టెప్పులు వేయించిన ప్రేమ్ రక్షిత్ లకు దీవెనలు. 

ఈ పాట కోసం మీ అందరి కష్టం పాటకు ఇలాంటి గొప్ప అవార్డు తెచ్చి పెట్టేలా చేసింది. తెలుగు సినిమా ఇక్కడతో ఆగకుండా మరింత ముందుకు వెళ్లి మరిన్ని ఆస్కార్ అవార్డులు రాబోయే కాలంలో తీసుకురావాలని కోరుకుంటూ.. మీ శ్యామలా దేవి.

It is the Krishnam Raju Dream Says His wife Shyamala Devi:

Shyamala Devi Happy with RRR Gots Oscar Award

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ