గీతూ రాయల్ యూట్యూబ్ ద్వారా ఫెమస్ అయ్యి తర్వాత జబర్దస్త్ స్టేజ్ పై కామెడీతో హైలెట్ అయ్యింది. ఓవర్ యాక్షన్ తో బిగ్ బాస్ హౌస్ లో చేసిన హడావిడికి కొంతమంది ఆమెని హేట్ చేస్తే మరికొంత ఆమెని బాగా మెచ్చుకున్నారు. చాలా యాక్టీవ్ గా ఉంది.. బోల్డ్ గా మాట్లాడుతుంది. అలాగే విపరీతమైన తెలివితేటలు కి చాలామంది ఫిదా అయ్యారు. నాగార్జున, బిగ్ బాస్ కూడా గీతూ రాయల్ తెలివితేటల్ని తట్టుకోలేక మధ్యలోనే పంపించేశారు.
అయితే బయటికొచ్చాక ఏడ్చింది ఏడ్చినట్టే ఉంది. బిగ్ బాస్ తనని మధ్యలోనే బయటికి పంపేశారని ఏడుస్తూనే ఉంది. అయితే తాజాగా రానా నాయుడు హీరో రానాని గీతూ రాయల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు రానా గారు నేను బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చా.. అక్కడ నన్ను నా తెలివిని కొంతమంది హేట్ చేస్తే.. కొంతమంది లైక్ చేసారు. నేను నేనులా ఉండాలా.. నేను మరలా అని అడిగింది. దానికి రానా.. నువ్వు నువ్వులా ఉండు.. కొత్తగా మారి ఏం చేస్తావ్.
లేవగానే నీకు ఎలా ఉండాలి అనిపిస్తుంది. ఎలా ఉంటే నువ్ సంతోషంగా ఉంటావ్ అని అడిగితే.. నాకు నేనుగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అంది గీతూ. అయితే నువ్వు నీలానే ఉండు.. కొత్తగా మారాల్సిన అవసరం లేదు, బోల్డ్ గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతావ్ అన్నాడు రానా.. తనకి మంచి సలహా ఇచ్చిన రానాకి గీతూ థాంక్స్ చెప్పింది.