గతంలో జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ కామెడీ చేసుకునేవారు ఇతర ఛానల్స్ లో ఏ ప్రోగ్రాం చేసుకోవడానికి వీలుండేది కాదు.. అసలు మల్లెమాల అగ్రిమెంట్ దానికి ఒప్పుకునేది కాదు. బయట ఛానల్స్ లో ఛాన్స్ వస్తే.. ఇక జబర్దస్త్ కి నో ఎంట్రీ అన్నట్టుగా ఉండేది పరిస్థితి. అలా చాలామంది కమెడియన్స్, అందులోను టాప్ కమెడియన్స్ జబర్దస్త్ ని వదిలేసి వెళ్లారు. వాళ్ళు ఇప్పటికీ కిందా మీదా పడినా జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వలేకపోతున్నారు. ఈమధ్యనే ఆరు నెలలు బ్రేక్ తీసుకుని జబర్దస్త్ నుండి బయటికి వచ్చి స్టార్ మాలో యాంకరింగ్ చేసిన సుడిగాలి సుధీర్ ఇప్పుడు జబర్దస్త్ లో కి రావడానికి నానా పాట్లు పడుతున్నాడు.
అయితే ప్రస్తుతం జబర్దస్త్ కాస్త వెసులుబాటు కలిపిస్తోంది. అంటే జబర్దస్త్ అగ్రిమెంట్ లో మార్పులు మొదలైనట్లే అంటున్నారు. ఎందుకంటే జబర్దస్త్ లో స్కిట్స్ చేసే నూకరాజు, పంచ్ ప్రసాద్ లు గతంలో జీ ఛానల్ సన్ డే ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేసి వచ్చినా జబర్దస్త్ లో కొనసాగుతున్నారు. వాళ్ళు అప్పట్లో జబర్దస్త్ వదిలేశారేమో.. అందుకే జీ ఛానల్ కి వెళ్లారనుకుంటే.. మళ్ళీ వారు జబర్దస్త్ లోను కనిపిస్తున్నారు.
ఇక ఇప్పుడు బుల్లెట్ భాస్కర్, ఆయన స్కిట్ లో చేసే పవిత్రలు జీ ఛానల్ లో రేపు ఆదివారం ప్రసారం కాబోయే లేడీస్ అండ్ జెంటిల్మన్ లో కామెడీ జోడి కాదు.. ఖతర్నాక్ జోడి అంటూ భాస్కర్ తో పాటుగా పవిత్ర వచ్చేస్తుంది.
మరి జబర్దస్త్ చేసుకుంటూనే ఇలా ఆడపడదడపా వేరే ఛానల్స్ లో ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి జబర్దస్త్ యాజమాన్యం కాస్త వెసులుబాటు కల్పించినట్లుగా తెలుస్తుంది. అంటే జబర్దస్త్ లేదంటే బిగ్ స్క్రీన్ అన్నట్టుగా కాకుండా.. అప్పుడప్పుడు వేరే ఛానల్స్ లో సందడి చేసే అవకాశం గతంలో ఆది, శ్రీను, సుదీర్లకి వచ్చింది. వాళ్ళు ఫెస్టివల్ స్పెషల్ ప్రోగ్రామ్స్ కి ఇతర ఛానల్స్ కి వెళ్లేవారు. ఇప్పుడు చిన్న కమెడియన్స్ కి కూడా అలాంటి వెసులుబాటు మల్లెమాల కల్పించినట్లుగా తెలుస్తుంది.