ఒకప్పుడు హీరోయిన్ పాత్రలతో మెప్పించిన యమున తర్వాత హీరోయిన్స్ అవకాశాలు తగ్గిపోయాక.. సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సీరియల్ షూటింగ్ తో బిజీగా వున్న సమయంలో యమున 2011 లో బెంగుళూర్ లోని ఓ హోటల్ లో జరిగిన రైడ్ లో పట్టుబడడం కలకలం సృష్టించింది. కెరీర్ అంత బావున్న సమయంలో యమున ఇలా చెయ్యడం అప్పట్లో అందరిని షాక్ కి గురి చేసింది. ఆ కేసుతో యమున చాన్నాళ్లు ఎవరికీ కనిపించలేదు. అలాగే ఆమెకి బుల్లితెర అవకాశాలు కూడా తగ్గిపోయాయి.
కానీ ఆ కేసులో తానేమి తప్పేమి చెయ్యలేదు అని ఎంత మొత్తుకున్నా, కోర్టు ఆ విషయంలో క్లీన్ చిట్ ఇచ్చినా తనని సోషల్ మీడియా వేధిస్తుంది అంటూ యమున ఓ వీడియో నో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ కేసులో కావాలనే కొంతమంది తనని ఇరికించినట్లుగా ఎన్ని ఇంటర్వూస్ లో చెప్పినా, ఆఖరికి కోర్టు నమ్మి నన్ను నిర్దోషి అని తీర్పు ఇచ్చినా.. ఆ కేసు తాలూకు గతం నన్ను ఇప్పటికి వేధిస్తుంది. కొంతమంది నా మీద ఆరోపణలు చేస్తూ యూట్యూబ్ ఛానల్స్ లో ఆసభ్యకరమైన తన్మయిల్స్ పెడుతూ వేధిస్తున్నారు.
ఎన్నిసార్లు నేను నిర్దోషిని అని చెప్పినా సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేకపోతున్నాను, మానసికంగా వేధిస్తున్నారు. నేను కూడా మనిషినే.. నేను చచ్చిపోయినా సోషల్ మీడియా నన్ను వదిలేలా లేదు అంటూ యమున తన ఆవేదనని ఆ వీడియో లో వ్యక్తం చేసింది.