Advertisementt

వెంట్రిమారన్ తో ఎన్టీఆర్: ఫుల్ క్లారిటీ

Sat 11th Mar 2023 07:11 PM
vetrimaaran,ntr  వెంట్రిమారన్ తో ఎన్టీఆర్: ఫుల్ క్లారిటీ
NTR with Vetrimaaran: Full Clarity వెంట్రిమారన్ తో ఎన్టీఆర్: ఫుల్ క్లారిటీ
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ తో NTR30 మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. అమెరికాలో ఆస్కార్ అవార్డుల హడావిడి ముగియగానే ఎన్టీఆర్ NTR30 షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఇక ఈ చిత్రం పాన్ ఇండియా లోని పలు భాషల్లో తెరకెక్కుతుంది. కొరటాల మూవీ తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో NTR31 చేస్తారు. ఆ మూవీ కూడా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఉండబోతున్నట్లుగా ప్రశాంత్ నీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే కన్ ఫర్మ్ చేసారు. ఇక ఏ మూవీ తర్వాత ఎన్టీఆర్ తమిళ దర్శకుడు వెంట్రి మారన్ తో మరో మూవీ చేస్తారని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది.

అది కూడా ఎన్టీఆర్-ధనుష్ కలయికలో వెంట్రిమారన్ దర్శకత్వంలో వడ చెన్నై 2 తీస్తున్నారనే ప్రచారం జరుగుతుండగా.. ధనుష్ తో ఎన్టీఆర్ సినిమా చెయ్యడం లేదు అని ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ఇక ఇప్పుడు వెంట్రిమారన్ కూడా ఎన్టీఆర్ తో సినిమా తీస్తున్నట్టుగా క్లారిటీ ఇవ్వకపోవడంపై ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ ఫీలైపోతున్నారు. వెట్రిమారన్ రీసెంట్ మూవీ విడుతలై Part 1 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన తదుపరి ప్రాజెక్ట్స్ పై మాట్లాడారు. కానీ ఆ లైనప్ లో ఎన్టీఆర్ మూవీ లేకపోవడం ఎన్టీఆర్ ఫాన్స్ ని డిస్పాయింట్ చేసింది.

ప్రస్తుతం తాను విడుతలై Part 1 రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా వున్నాను, తర్వాత విడుతలై Part 2 పై నా ఫోకస్ ఉంటుంది. ఆ తర్వాత విజయ్ తో ఓ మూవీ చెయ్యాల్సి ఉంది. విజయ్ తర్వాత వడ చెన్నై 2 పనులు మొదలు పెడతాను అంటూ వెట్రిమారన్ చేసిన కామెంట్స్ లో ఎన్టీఆర్ పేరు ప్రస్తావన రాకపోవడంతో అసలు వెట్రిమారన్-ఎన్టీఆర్ మూవీ ఉంటుందా అనే అనుమానాలు ఫాన్స్ లో మొదలయ్యాయి.

వెట్రి మారన్ లాంటి మాస్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ కి ఓ సినిమా పడితే కేక అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ ఊహించుకున్నారు. కానీ ఇప్పుడు వెట్రిమారన్ తో ఎన్టీఆర్ మూవీ లేదు అంటూ వినిపించడం వారికి ఎంతో కష్టంగా ఉంది. 

NTR with Vetrimaaran: Full Clarity:

Vetrimaaran movie with NTR is just a rumour

Tags:   VETRIMAARAN, NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ