Advertisementt

ప్రియాంక చోప్రాతో చరణ్ దంపతులు

Sat 11th Mar 2023 12:39 PM
priyanka chopra,ram charan,upasana  ప్రియాంక చోప్రాతో చరణ్ దంపతులు
Ram Charan couple with Priyanka Chopra ప్రియాంక చోప్రాతో చరణ్ దంపతులు
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ దంపతులు ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నారు. రామ్ చరణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసిషియన్, ఆస్కార్ అవార్డుల కోసం అమెరికా వెళ్లగా.. ఉపాసన మధ్యలో చరణ్ తో జాయిన్ అయ్యింది. అక్కడ షాపింగ్స్, అలాగే విహార యాత్రలంటూ ఈ దంపతులు ఇక్కడ మెగా ఫాన్స్ కి ఉత్సాహాన్ని పంచుతున్నారు. ఇక గత రాత్రి గ్లోబల్ స్టార్ ప్రియాంక ఇచ్చిన ప్రీ ఆస్కార్ పార్టీకి రామ్ చరణ్ భార్య ఉపాసనతో సహా హాజరయ్యాడు. రామ్ చరణ్ బాలీవుడ్ డెబ్యూ తుఫాన్ లో ప్రియాంకనే హీరోయిన్.

ఇక అమెరికాలోనే నివాసముంటున్న ప్రియాంక చోప్రా కొన్నాళ్లుగా బాలీవుడ్ సినిమాలని కూడా పక్కనపెట్టేసి భర్త నిక్ జోన్ తో కలిసి అమెరికాలోనే కనిపిస్తుంది. అక్కడే హాలీవుడ్ వెబ్ సీరీస్ లు, సినిమాలు చేస్తుంది. ఇక ఆస్కార్స్ కోసం వచ్చిన ఎన్టీఆర్, రాహుల్ సిప్లిగంజ్, రాజమౌళి, రామ్ చరణ్ దంపతులకి అలాగే బాలీవుడ్ నుండి ఆస్కార్స్ కోసం హాజరైన వారికి ప్రియాంక చోప్రా గ్రాండ్ గా ప్రీ ఆస్కార్స్ పార్టీ ఇచ్చారు. అక్కడే ప్రియాంక చోప్రా రామ్ చరణ్ దంపతులతో సందడి చేసింది. ఫొటోలకి ఫోజులిచ్చింది.

ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో చరణ్ తో ప్రియాంక, ప్రియాంక తో ఉపాసన, రామ్ చరణ్ ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Ram Charan couple with Priyanka Chopra:

Priyanka Chopra host pre Oscars party

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ