కిర్రాక్ ఆర్పీ వెనుక ఉన్న జబర్దస్త్ మాయమైపోయింది. ఇప్పుడు నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు ఆర్పీ ని హీరో ని చేసింది. నెల్లూరు చేపల పులుసు కర్రీ పాయింట్ తో తెగ ఫెమస్ అయిన ఆర్పీని ఇప్పుడు చేపల పులుసు ఆర్పీ గా మార్చేసింది. కూకట్ పల్లి బ్రాంచ్ నుండి.. మణికొండ బ్రాంచ్ వరకు ఆర్పీ సక్సెస్ ని యూట్యూబ్ ఛానల్స్ తెగ చూపించేస్తున్నాయి. అసలు ఆర్పీ చేపల పులుసు అంతలా ఫెమస్ అవడానికి ప్రధాన కారణం యూట్యూబ్ ఛానల్స్ అనడంలో సందేహమే లేదు. అందుకే అందరిలో ఆర్పీ ఈ యూట్యూబ్ ఛానల్స్ కి ఎంతిచ్చి పబ్లిసిటీ చేయించుకున్నాడో అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.
అయితే ఆర్పీ రీసెంట్ గా అమీర్ పేటలోని చేపల పులుసు బ్రాంచ్ ఓపెన్ చేసాడు. అది కూడా కాబోయే భార్య లక్కీతో కలిసి ఈ కర్రీ పాయింట్స్ ని గ్రాండ్ గా ఓపెనింగ్స్ చేసాడు ఆర్పీ. అయితే గత రెండేళ్లుగా లక్కీని ఆర్పీ వివాహం చేసుకుంటాడని అనడమే కానీ.. ఇంతవరకు పెళ్లి చేసుకుంది లేదు. ఎప్పుడో వీరికి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. అయితే ఈ ఫిబ్రవరిలోనే ఆర్పీ-లక్కీ వివాహం జరగాల్సి ఉన్నప్పటికీ.. ఈ చేపల పులుసు బ్రాంచెస్ ఓపెన్ చేసే పనిలో పెళ్లిని పోస్ట్ పోన్ చేసినట్లుగా చెప్పారు.
ఈ బిజినెస్ వల్ల పెళ్లి కొద్దిగా లేట్ అయ్యింది, వచ్చే నవంబర్ లో లక్కీని వివాహం చేసుకుంటాను, ఆమెని నాలుగున్నరేళ్ళు వెంటపడి ప్రేమించాను, అమ్మాయిని ఒప్పించడానికి రెండేళ్లు, లక్కీ పెద్దవాళ్ళని ఒప్పించడానికి మరో రెండేళ్లుగా పట్టింది అంటూ అమీర్ పెట్ బ్రాంచ్ ఓపెనింగ్ లో ఆర్పీ-లక్కీలు తమ వివాహం ఖచ్చితంగా నవంబర్ లో ఉంటుంది అని చెప్పారు.