బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అయ్యాక రాహుల్ సిప్లిగంజ్ కెరీర్ లో వెనుదిరిగి చూసుకోలేదు. ఆయన పాడిన ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ ఇప్పుడు ఆస్కార్ కోసం ఎదురు చూస్తుంది. రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటుగా రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ కోసం అమెరికా వెళ్ళాడు. ఆస్కార్ వేదికపై కాల భైరవతో పాటు లైవ్ లో నాటు నాటు సాంగ్ పాడడానికి రాహుల్ అమెరికా వెళ్ళాడు. తెలుగు సింగర్ ఇలా ఆస్కార్ వేదిక లైవ్ సాంగ్ పాడడం ఇదే మొదటిసారి కావడంతో రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో ఫెమస్ అయ్యాడు.
అయితే అక్కడ ఆస్కార్ వేడుకలో పాల్గొనకముందే.. ప్రియాంక చోప్రా ఇచ్చిన ప్రీ ఆస్కర్స్ పార్టీకి ఎన్టీఆర్ అండ్ ఆర్.ఆర్.ఆర్ టీమ్ ఇంకా రాహుల్ కూడా హాజరయ్యాడు. ఆ పార్టీకి హాజరైన రాహుల్ ఎన్టీఆర్ తో, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాలతో ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ పిక్స్ దిగి సోషల్ మీడియాలో షేర్ చేసాడు.. ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా స్టార్ అయిన ఎన్టీఆర్ తో రాహుల్ పిక్ షేర్ చేసుకుంటూ.. With one of my most favourite actor and a very down to earth person! Very glad meeting you Jr NTR anna 🔥❤️on this amazing occasion #oscars95 క్యాప్షన్ పెట్టాడు. అంతేకాకుండా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాతో రాహుల్ ఫోటో దిగాడు. ఈ రెండు ఫొటోస్ రాహుల్ విడివిడిగా దిగి సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే వైరల్ అయ్యాయి.
గల్లీ పోరడు, బిగ్ బాస్ విన్నర్ ఇలా అంతర్జాతీయ వేదికపై తెలుగు పాట పాడి వినిపించడం తెలుగోళ్లందరికి గర్వకారణమే. ఆస్కర్స్ వేదికపై ఈ గల్లీ బాయ్ పాట వినేందుకు అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.