ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ కి పెట్టే ఖర్చు 80 కోట్లు.. దానితో పది సినిమాలు తీసి మోహన కొడతా అంటూ తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారాన్ని రేపాయి. ప్రముఖులైన రాఘవేంద్ర రావు, నాగ బాబు వేరు వేరు స్టయిల్స్ లో స్పందించారు. నాగ బాబు అయితే కాస్త ఘాటుగా ఆ 80 కోట్లు మీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టాడా.. నీకెందుకు ఆ ఖర్చు గురించి అంటే.. రాఘవేంద్ర రావు గారు అయితే.. తెలుగోడి సత్తా చాటుతున్నందుకు సన్తతోషపడాలి కానీ.. ఆ 80 కోట్లు పెట్టినట్లుగా నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫోర్మేషన్ ఉందా.. జేమ్స్ కెమరూన్, స్పీల్ బర్గ్ లాంటి వాళ్ళు డబ్బు తీసుకుని ఆర్.ఆర్.ఆర్ ని పొగుడుతున్నారా అంటూ తమ్మారెడ్డికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసారు.
అయితే రాఘవేంద్ర రావు, నాగబాబు మాటలతో బాగా హార్ట్ అయిన తమ్మారెడ్డి రియాక్ట్ అయ్యారు.. నేను మాట్లాడిన మాటలేమిటి.. మీరు మాట్లాడేదేమిటి.. నేను ఇంతకుముందు ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ కి రావడం మనకెంతో గర్వకారణమని చెప్పాను, దాన్ని వదిలేసి.. ఆరోజు మూడు గంటల సెమినార్‌లో జరిగిన విషయాన్ని పెద్దది చేసారు. చిన్న, భారీ బడ్జెట్ సినిమాల గురించి మాట్లాడాం. అందులో ఎక్కువగా చిన్న సినిమాలు గురించి మాట్లాడాం. చిన్న సినిమాలు చేసే వారితో మాట్లాడుతూ మీరు తీసే సినిమాలు రిలీజ్ కావు. థియేటర్స్ దొరకవు. అవార్డులు రావు. ఫెస్టివల్స్‌కి ఎలా వెళ్లాలి.. ఏం చేయాలనే డిస్కషన్ జరుగుతుంది. ఆ సందర్బంగా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాం. RRR, KGF 2 వంటి సినిమాలను చూస్తాం. కానీ ఆ సినిమాలని తీయాలంటే అంత సులభం కాదు అని మాట్లాడాను.
కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దలు నీకు లెక్కలు తెలుసా, రాజమౌళిని చూసి నేను జెలసీగా ఫీల్ అవుతున్నానని అంటున్నారు. అసలు నేను ఆయన్ని చూసి జెలసీ ఫీల్ అవటానికి నా రేంజ్ ఏమిటి రాజమౌళి రేంజ్ ఏమిటి. నాకెందుకు జెలసీ. నేనేదో కృష్ణా, రామా అని బ్రతుకుతున్నాను. వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బయట వ్యక్తులంటే పెద్దగా పట్టించుకోను. కానీ.. ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నవారు నన్ను మాట్లాడుతున్నారు.
నేను ఈరోజు మీ గురించి బ్యాడ్‌గా మాట్లాడితే ఇండస్ట్రీ గురించి బ్యాడ్‌గా మాట్లాడినట్లే. నేను నోరు విప్పితే చాలా మాట్లాడతాను, ఎవరెవరు ఏయే పదవులు కావాలి అని అడిగారో, ఏయే అవార్డుల కోసం అడుక్కున్నారో అనేది అన్నీ తెలుసు.. అవి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీకు సిగ్గులేకపోవచ్చు. నాకు సిగ్గు, అభిమానం అన్నీ ఉన్నాయి. నేను మాట్లాడితే ఇండస్ట్రీ పరువే పోతుంది అంటూ తమ్మారెడ్డి అన్నారు.