ఎన్టీఆర్ ఫాన్స్ ఏ విషయంలో హార్ట్ అవ్వలేదు. ఆయన అమెరికాకి వెళ్ళలేదు అని హార్ట్ అయ్యారు. NTR30 ఓపెనింగ్ అప్ డేట్ ఇవ్వడం లేదు అని హార్ట్ అయ్యారు.. NTR30 లేట్ అవుతుంది.. మిగతా స్టార్స్ దూసుకుపోతున్నారంటూ హార్ట్ అయ్యారు.. ఇలా ఏ విషయమైనా ఎన్టీఆర్ ఫాన్స్ హార్ట్ అవుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఎన్టీఆర్ ఫాన్స్ హార్ట్ అయ్యింది మాత్రం అందుకు కాదు.. ఎందుకంటే మొన్నామధ్యన కళ్యాణ్ రామ్ అమిగోస్ ఈవెంట్ లో అప్ డేట్ గురించి ఫాన్స్ నానా గోల గోల చేస్తున్నారు, అప్ డేట్ ఉంటే మేమె చెబుతాము, నిర్మాతలు కూడా ఈ విషయంలో ఒత్తిడి ఫీలవుతున్నారు, ఏదైనా ఉంటే మా భార్య కన్నా ముందు మీకే చెబుతాం అంటూ కాస్త వార్నింగ్ టోన్ లో మాట్లాడారు.
అందుకోసమే ఎన్టీఆర్ ఫాన్స్ బాగా హార్ట్ అయ్యారట. మేము ఎన్టీఆర్ హార్డ్ కొర్ ఫాన్స్ మి.. ఆయన ఆలా మట్లాడినందుకు బాధపడ్డాము అంటూ దర్శకనిర్మాత తమ్మారెడ్డి దగ్గర ఎన్టీఆర్ ఫాన్స్ వాపోయినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకరు, 40 ఏళ్ళు ఉంటాయేమో.. ఆయన మేము చాలా స్ట్రాంగ్ ఫాన్స్ మండి.. చాలా గొప్ప ఫాన్స్ మండి, చదువు కున్నవాళ్ళం మేము ఎన్టీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ కి అడ్జెస్ట్ అయ్యాము. కానీ చదువులేని వాళ్ళ బాగా ఫీలయ్యారు అని చెప్పాడు. అదేమిటి ఎన్టీఆర్ అభిమానులతో చాలా బాగా ఉంటాడు కదా అని నేను అడిగితే.. ఈ మధ్యన ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కి బాధేసింది.. అప్ డేట్స్ ఇవ్వాలంటే చాలా కష్టాలుంటాయి అంటూ హర్ష్ గా మట్లాడారు. సినిమా ఎలా తియ్యాలి, నిర్మాతల కష్టాలు నిర్మాతలకి, నా కష్టాలు నాకు, సినిమా తీసే వాళ్ళ కష్టాలు వాళ్ళకి ఉంటాయి అన్నారు దానికి మాకు బాధేసింది అన్నాడు.
మరి అది నిజమే కదా.. ఎన్టీఆర్ ఇవ్వాళ ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. ఆయన అన్ని చూసుకోవాలి, మిమ్మల్ని సంతోషపరచాలి, ఆయన సంతోషపడాలి, ప్రొడ్యూసర్స్ కి డబ్బులు రావాలి.. ఇలా అన్ని అలోచించి చేస్తాడు. నిర్మాతల మీద ప్రెజర్ పెట్టకూడదు అనుకుంటాడు. అలాంటి వాడి మీద మీరు హార్ట్ అవ్వకూడదు, ఎన్టీఆర్ ఫాన్స్ కి ఇచ్చిన గౌరవం ఎవ్వరూ ఇవ్వరు అంటూ వారికి చెప్పానంటూ తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.