Advertisementt

హీరోయిన్స్ పెళ్ళిళ్ళపై కృతి సనన్ కామెంట్స్

Fri 10th Mar 2023 12:22 PM
kriti sanon  హీరోయిన్స్ పెళ్ళిళ్ళపై కృతి సనన్ కామెంట్స్
Kriti Sanon comments on heroines marriages హీరోయిన్స్ పెళ్ళిళ్ళపై కృతి సనన్ కామెంట్స్
Advertisement
Ads by CJ

సినిమాల్లో నటించే హీరోయిన్స్ కి పెళ్లి కావు.. హీరోయిన్స్ ని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు అనేది ఎప్పటినుండో వినిపిస్తున్న మాటే. చాలామంది హీరోయిన్స్ ప్రేమించి పెళ్లాడిన సందర్భాలే కానీ.. పెద్దలు కుదిర్చగా.. హీరోయిన్స్ పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. తాజాగా హీరోయిన్స్ ని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు ఇది నిజం అంటూ ఈమధ్యన ప్రభాస్ తో ప్రేమ, ఎంగేజ్మెంట్, పెళ్లి విషయంలో హాట్ టాపిక్ గా నిలిచిన ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి పెళ్లిళ్లు కావనే అభిప్రాయం చాన్నాళ్లుగా ఉంది. నిజంగానే హీరోయిన్స్ ని పెళ్లిళ్లు చేసుకోవడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. ఎందుకంటే యాక్ట్ చెయ్యడం అనేది వారు చేసే పనిలో అంటే వృత్తిలో భాగమే అని ఎవ్వరూ అనుకోరు. నేను కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా సినిమాలు మొదలు పెడుతున్న తరుణంలో నా ఫ్రెండ్స్ ఇలాంటి కామెంట్స్ చేసి భయపెట్టారు. హీరోయిన్స్ ని ఎవరూ పెళ్లి చేసుకోరు అనేవారు. 

కానీ నేను ఆ మాటలని పక్కనబెట్టి కెరీర్ లో ముందుకు వెళ్ళాలి అనుకున్నాను. పెళ్లి మాటలు సీరియస్ గా తీసుకోకుండా కెరీర్ మొదలు పెట్టాను. ఇప్పుడు నా కెరీర్ లో నేను రాణిస్తున్నాను అంటూ కృతి సనన్ హీరోయిన్స్ పెళ్ళిళ్ళపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Kriti Sanon comments on heroines marriages:

Kriti Sanon was told by friend No one wants to marry an actress

Tags:   KRITI SANON
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ