పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు భారీ బడ్జెట్ సినిమాలు, ఆ సినిమా షూటింగ్స్ అంటూ బాగా బిజీగా తిరగడంతో కాస్త రెస్ట్ కూడా దొరకడం లేదు. దానితో ఆయన తరుచూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారు. సంక్రాంతి తర్వాత ప్రభాస్ వైరల్ ఫీవర్ బారిన పడి ఓ పది రోజులపాటు షూటింగ్స్ కి దూరమయ్యారు. మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ కి సడన్ గా ఆరోగ్యం పడడంతో ఆయన వెంటనే ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్ళిపోయినట్లుగా చెబుతున్నారు.
ఆయన చేస్తున్న సినిమా షూటింగ్స్ కి ప్రభాస్ వెంటనే అన్ని బ్రేక్ ఇచ్చేసి స్పెషల్ ఫ్లైట్‌లో ప్రభాస్ విదేశాలకు వెళ్లిపోయారని తెలుస్తుంది. అయితే అసలు ప్రభాస్ కి ఏమైందో తెలియక, ఆయన ఆరోగ్య సమస్య ఏమిటో అర్ధం కాక వాళ్ళు ఆందోళన పడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ K షూటింగ్ చివరికి వచ్చింది. అలాగే సలార్, మారుతీ షూటింగ్ లకి ప్రభాస్ బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆదిపురుష్ షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా.. సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఇక ప్రభాస్ కి అసలేమైందో.. ప్రభాస్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నిజమో.. కాదో.. తెలియని అయోమయంలో ప్రభాస్ ఫాన్స్ ఉన్నారు.