మెగాస్టార్ డాటర్ సుశ్మిత తండ్రికి కాస్ట్యూమ్స్ డిజైనర్ గాను, నిర్మాతగానూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. అటు చిన్న కుమర్తె శ్రీజ పర్సనల్ లైఫ్ లో ప్రోబ్లెంస్ ఫేస్ చేస్తూ కుటుంభం అండతో కోలుకుంటుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి తన కుమర్తె సుశ్మితకి ఉమెన్స్ డే రోజున అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. దుర్గామాత విగ్రహాన్ని ఇచ్చారు. అది ప్యూర్ సిల్వర్ అండ్ కొంత గోల్డ్ తో చేసినట్టుగా కనిపిస్తుంది. మెగాస్టార్ చిరు తన కుమర్తె చేతికి అమ్మవారి విగ్రహాన్ని ఇస్తూ ఫొటోలకి ఫోజులిచ్చారు.
తన తల్లి-భార్య సురేఖతో ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసిన చిరు అందరికి ఉమెన్స్ డే విషెస్ చెప్పారు. అదే ఉమెన్స్ డే రోజున కూతురు సుశ్మితకి ఇలా బహుమతి ఇస్తూ విష్ చెయ్యడంతో సుశ్మిత ఆనందంతో ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా.. అవి వైరల్ గా మారాయి.