Advertisementt

తల్లికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన తారకరత్న కుమార్తె

Thu 09th Mar 2023 11:33 AM
taraka ratna. alekhya reddy  తల్లికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన తారకరత్న కుమార్తె
Taraka Ratna Wife Alekhya Reddy Shares Daughter Nishika Note తల్లికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన తారకరత్న కుమార్తె
Advertisement
Ads by CJ

తారకరత్న మరణించి 20 రోజులవుతుంది. 23 రోజులపాటు ప్రాణాలతో పోరాడి శివరాత్రి రోజున శివైక్యం చెందిన తారకరత్న మరణాన్ని ఆయన భార్య అలేఖ్య రెడ్డి అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. తన తోడు తనని వదిలి వెళ్లిపోవడం ఆమె నమ్మలేకపోతూ ఇంకా దుఃఖిస్తూనే ఉంది. తారకరత్న మరణించినప్పటినుండి ఆయన పెద్ద కర్మ వరకు ఆమె బాధని ప్రత్యక్షంగా చూసి కన్నీళ్లు పెట్టని అభిమాని లేరు. ఆమెని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు.

ఆయన మరణించాక తారకరత్న పుట్టినరోజు సందర్భంగా కన్నీళ్లు పెడుతూ కుమార్తె నిష్కతో ఉన్న ఫోటోని షేర్ చేసిన అలేఖ్య.. చిన్నకర్మ తర్వాత తాము పెద్ద తిరుపతికి చివరి ప్రయాణం చేసినట్టుగా తమ ఫ్యామిలీ పిక్ ని పోస్ట్ చేసి కన్నీటి పర్యంతమవుతూ.. తాము పడిన కష్టాలని ఆ నోట్ లో రాసింది. అలాగే పెద్ద రోజు తర్వాత వాలెంటైన్స్ డే కి తన భర్త తనకి రాసిన ఆఖరి ప్రేమలేఖని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే తన తండ్రి మరణంతో కుంగిపోతున్న తల్లికి తారకరత్న కుమర్తె నిష్క స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.

తల్లి మంచి కోసం నిష్క ఓ నోట్ రాసింది. దానిని అలేఖ్య రెడ్డి షేర్ చేసింది. అమ్మా నువ్వు చాలా బాధపడుతున్నావు. ఇంకోసారి ఏడిస్తే.. నీకు గుడ్ బై చెప్పేస్తా అంటూ నిష్క తల్లి బాధని కంట్రోల్ చెయ్యడానికి ఇలా స్వీట్ గా వార్నింగ్ ఇస్తూ రాసిన నోట్ అందరి చేత కంటతడి పెట్టిస్తుంది. తారకరత్నకు పెద్ద కుమార్తె నిష్క అంటే ఎనలేని ప్రేమ. కూతురు రాసిన ఈ నోట్ ని అలేఖ్య సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిన్ను చాలా మిస్ అవుతున్నా అంటూ మరోసారి బాధపడింది. 

Taraka Ratna Wife Alekhya Reddy Shares Daughter Nishika Note:

Alekhya Reddy Shares Daughter Nishika Note In Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ