Advertisementt

పాపం రాజమౌళి అలా అనేశారా?

Wed 08th Mar 2023 09:59 PM
raashi khanna,bahubali,rajamouli  పాపం రాజమౌళి అలా అనేశారా?
Raashi Khanna Missed Chance In Bahubali Movie పాపం రాజమౌళి అలా అనేశారా?
Advertisement
Ads by CJ

రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా నటించాలంటే ఎంతో పెట్టి పుట్టాలి. అంటే లక్కు కలిసి రావాలి. అలా అనుష్కకి బాగా కలిసొచ్చింది. కానీ ఇప్పుడొక హీరోయిన్ రాజమౌళి తో వర్క్ చేసే అదృష్టాన్ని కోల్పోయినట్లుగా చెప్పి తెగ బాధపడిపోతోంది. ఆమె ఎవరో కాదు.. రాశి ఖన్నా. ఈమధ్యన టాలీవుడ్ సినిమాల్లో పెద్దగా వినిపించని, కనిపించని రాశి ఖన్నా రీసెంట్ గా డిజిటల్ ఎంట్రీతో ఆకట్టుకుంది. ఫార్జి వెబ్ సీరీస్ తో రాశి ఖన్నా బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. అలాగే హిందీ మూవీ ఒకటి చేస్తుంది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రాశి ఖన్నా తనకి బాహుబలిలో తమన్నా చేసిన అవంతిక కేరెక్టర్ ఎలా మిస్ అయ్యిందో చెప్పి ఫీలయ్యింది.

తాను బాహుబలి లో అవంతిక కేరెక్టర్ మొదట తనకే వచ్చినట్లుగా చెప్పింది. బాహుబలి కోసం అప్పుడు ఆడిషన్స్ కి  వెళ్లిన సమయంలో రాజమౌళి గారు నన్ను చూసి ఈ అమ్మాయి ప్రేమ కథలకి బాగా సూట్ అవుతుంది, ఈ అమ్మాయి చాలా క్యూట్ గా ఉంది అంటూ ఆయన ఫ్రెండ్ తీసే సినిమా కి సజెస్ట్ చేసారు. కథ వింటే నీకు తప్పకుండా నచ్చుతుంది అంటూ ఊహలు గుసగుసలాడే కోసం తనని ఆ ప్రొడ్యూసర్ కి  పరిచయం చెయ్యగా.. నా ఫస్ట్ మూవీ అలా సెట్ అయ్యింది. ఇలా బాహుబలి లో ఛాన్స్ పోగొట్టుకున్నట్లుగా చెప్పుకొచ్చింది.

లేదంటే బాహుబలి తమన్నా ప్లేస్ లో మనం రాశి ఖన్నాని చూడాల్సి వచ్చేది. బాహుబలి అంటే పాన్ ఇండియా మూవీ. రాశి ఖన్నాకి ఫస్ట్ మూవీ భారీ బడ్జెట్, పాన్ ఇండియా ఫిల్మ్ లో నటించే అవకాశం అలా రాజమౌళి వల్ల మిస్ అయ్యిందన్నమాట.

Raashi Khanna Missed Chance In Bahubali Movie:

Raashi Khanna misses Bahubali chance because of Rajamouli

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ