Advertisementt

ప్రభాస్ vs రామ్ చరణ్ ఇది ఫిక్స్

Wed 08th Mar 2023 08:56 PM
sankranthi box office,ram charan,prabhas  ప్రభాస్ vs రామ్ చరణ్ ఇది ఫిక్స్
Prabhas vs Ram Charan ప్రభాస్ vs రామ్ చరణ్ ఇది ఫిక్స్
Advertisement
Ads by CJ

ఈసారి సంక్రాంతి సీనియర్ హీరోలతో గడిచిపోగా.. వచ్చే సంక్రాంతి మాత్రం రసవత్తరంగా ఉండబోతుంది అనేది ఇప్పటినుండే కనిపిస్తుంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ K ని రిలీజ్ చేస్తున్నట్టుగా మహాశివరాత్రి రోజున మేకర్స్ ప్రకటించారు. మొదటగా ఈ సంక్రాంతికి  కచ్చిఫ్ కాదు టవల్ వేసిన ప్రభాస్ తో ఢీ కొట్టడానికి ఏ దసరా సమయానికో యంగ్ అండ్ స్టార్ హీరోలు రెడీ అవుతారనుకుంటే.. రామ్ చరణ్ ఇప్పటికే రెడీ అయినట్లుగా సూచనలు కనిపిస్తున్నాయి. సూచనలేమిటి.. రామ్ చరణ్ RC15 నిర్మాత దిల్ రాజు గారు అదే అంటున్నారు.

దర్శకుడు శంకర్ రామ్ చరణ్ తో చేస్తున్న RC15 ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే పనిలో ఉన్నారు, నాదీ అదే ఆలోచన అన్నట్లుగా అయన చెప్పడం చూస్తే ఖచ్చితంగా రామ్ చరణ్ వచ్చే సంక్రాంతికి రావడం పక్కా అనిపిస్తుంది. ఇక సిఇఓ టైటిల్ కూడా తాము అనుకుంటున్న టైటిల్స్ లో ఒకటి.. అదో, కాదో తెలియదంటూ దిల్ రాజు తప్పించుకున్నారు. ఈ రోజు ఉదయం నుండి ఈ టైటిల్ RC15 కి పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ ఒకటే హడావిడి.

మరి రామ్ చరణ్ vs ప్రభాస్ ఇది ఫిక్స్ అనేలా ఈ వార్త ఉండడంతో అప్పుడే మెగా ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీతో వస్తుంటే రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీతో రావడం బాక్సాఫీసుకి పెద్ద ఛాలంజ్ అని చెప్పాలి. ఇక అప్పటికి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కూడా ఏమైనా సంక్రాతి రేస్ లో జాయిన్ అవుతారేమో చూడాలి.

Prabhas vs Ram Charan:

Sankranthi Box Office Clash: Ram Charan Vs Prabhas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ