జనవరి 26 నుండి పవన్ కళ్యాణ్ ఫాన్స్ హరహర వీరమల్లు టీజర్ అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ హరి హర వీరమల్లు మేకర్స్ ఈ విషయంలో ఎలాటి స్టెప్ తీసుకోకపోవడం పవన్ ఫాన్స్ ని డిస్పాయింట్ చేసింది. కనీసం మహాశివరాత్రికి అయినా హరి హరవీరమల్లు రిలీజ్ డేట్ అప్ డేట్ ఏమైనా ఇస్తారేమో అంటూ ఎదురు చూసారు. కానీ అది లేదు. తాజాగా ఈ ఉగాదికి పవన్ కళ్యాణ్ నుండి సర్ ప్రైజ్ ఫాన్స్ కి అందబోతుందట. అయితే అది హరి హర వీరమల్లు అప్ డేట్ కాదండోయ్.. రెండు వారాల క్రితం మొదలైన పవన్ కళ్యాణ్-సాయి తేజ్ PKSDT సినిమా అప్ డేట్ అంటున్నారు.
సముద్రఖని దర్శత్వంలో తమిళంలో సూపర్ హిట్ హిట్ అయిన వినోదియం సిత్తం చిత్రాన్ని తెలుగులో PKSDT వర్కింగ్ టైటిల్ గా రీమేక్ చేస్తున్నారు. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ అలాగే సినిమా టైటిల్ కూడా ఇచ్చే ఉద్దేశ్యంలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఈ నెల 22 ఉగాది స్పెషల్ గా PKSDT నుండి పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి స్పెషల్ సర్ప్రైజ్ అది కూడా రీసెంట్ గా మొదలైన మూవీ నుండి అంటే మాములు విషయం కాదు. ఈ వార్త తెలిసిన పవన్ ఫాన్స్ అందుకే బాగా ఎగ్జైట్ అవుతున్నారు.
మరి ఈ రీమేక్ ని పవన్ కళ్యాణ్ ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా కంప్లీట్ చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సముద్రఖని కూడా పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ త్వరగా పూర్తి చెయ్యాలని చూస్తున్నారు.