నిజమే పాపం చరణ్ అనాల్సిందే. పెళ్లయ్యాక ప్రతి మగవాడు భార్య సేవలు చెయ్యాల్సిందే. అది ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా తప్పదు మరి. ఇప్పుడు రామ్ చరణ్ పరిస్థితి సేమ్ అలానే ఉంది. భార్య చేసిన షాపింగ్ బాగ్స్ మొయ్యడం, ఆమె హ్యాండ్ బాగ్స్ మొయ్యడం చూస్తే మెగా ఫాన్స్ అయ్యో చరణ్ నీకెంత కష్టం వచ్చింది అంటారు. మరి ఉపాసన తన భర్తతో ఎంత చక్కగా సేవలు చేయించుకుంటుందో అనేది అమెరికాలో ఆమె చేసిన షాపింగ్, అక్కడ చరణ్ పరిస్థితి చూస్తే అర్ధమవుతుంది.
HCA అవార్డ్స్ వేడుకకి ఒంటరిగా బయలుదేరి అమెరికా ఫ్లైట్ ఎక్కిన రామ్ చరణ్ ని ఓ పది రోజులు వదిలిపెట్టిన ఉపాసన, తర్వాత ఆమె కూడా ఆస్కార్ వేడుకల కోసం అమెరికాకి భర్త దగ్గరకి వెళ్ళిపోయింది. అక్కడ ఆస్కార్ వేడుకలకి ఇంకా సమయం ఉండడంతో చరణ్ తో కలిసి సముద్రంలో ఎంజాయ్ చెయ్యడమే కాదు.. అమెరికాలో షాపింగ్ కూడా చేసింది. అక్కడ అమెరికాలో తాము బేబీ మూన్ ని చూసి సంతోషపడుతున్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ పిక్స్ తో పాటుగా.. ఉపాసన ముందు నడుస్తూ ఉంటే తన వెనుక తాము షాపింగ్ చేసిన బ్యాగ్ లు అన్నీ భర్త రామ్ చరణ్ పట్టుకొని కనిపిస్తున్నాడు. అది చూసిన మెగా ఫాన్స్ అయ్యో పాపం చరణ్, పెళ్ళైన తర్వాత ప్రతి మగవాడి పరిస్థితి ఇంతే అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.