Advertisementt

దసరా వరకు ఇదే పరిస్థితా ?

Tue 07th Mar 2023 08:10 PM
nani,dasara  దసరా వరకు ఇదే పరిస్థితా ?
March box office is very dull దసరా వరకు ఇదే పరిస్థితా ?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం థియేటర్స్ లో చూసేందుకు ఆయామన్న సినిమా లేక ప్రేక్షకులు బాగా బోర్ ఫీలవుతున్నారు. పిల్లల పరీక్షల సమయంలో ఎవరూ సినిమాలు రిలీజ్ చేసేందుకు ముందుకు రారు. అందుకే ఫిబ్రవరి బాక్సాఫీసు చప్పగా ముగిసినా.. మార్చ్ అయినా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది అనుకుంటే.. మార్చి నెల మరింత ఘోరంగా తయారైంది. గత వారం ఏదో.. చిన్న సినిమా బలగం బావుంది అనిపించినా.. దానిని థియేటర్స్ లోనే చూడాలని ఆడియన్స్ అనుకోరు. ఓటిటి కోసం వెయిట్ చేస్తారు. ఇక ఈ వారం అయితే పేరున్న సినిమాలేవీ రావడం లేదు. అస్సలు ఫామ్ లో లేని ఆది సాయి కుమార్ CSI శాంతను తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఇక వచ్చే వారం ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయితో నాగ శౌర్య సందడి షురూ చేస్తున్నాడు. ఇలా వారం వారం చిన్న సినిమాలతో బాక్సాఫీసు ఖాళీగా కనిపిస్తుంది. అయితే దసరా వరకు ఇదే పరిస్థితి ఉండేలా కనిపిస్తుంది. దసరా అంటే వచ్చే అక్టోబర్ దసరా అనుకునేరు. నాని దసరా మూవీ. పాన్ ఇండియాలోని పలు భాషల్లో విడుదలకు సిద్దమైన దసరా మార్చి 30 న విడుదల కాబోతుంది. నాని, కీర్తి సురేష్ లు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్నారు. నాని హిందీ ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యడానికి ముంబై కూడా వెళ్ళాడు. అంత పకడ్బందీగా సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

మరి దసరా వరకు బాక్సాఫీసు ఇలానే డల్ గా కనిపించినా ఏప్రిల్ లో మళ్ళీ శాకుంతలం, రావణాసుర, అఖిల్ ఏజెంట్ సినిమాలు ప్రేక్షకులకు కిక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి.

March box office is very dull:

Nani Dasara releasing march 30

Tags:   NANI, DASARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ