Advertisementt

ఈ ఏడాది చరణ్ కి చాలా ప్రత్యేకం: ఉపాసన

Tue 07th Mar 2023 06:29 PM
upasana konidel,ram charan  ఈ ఏడాది చరణ్ కి చాలా ప్రత్యేకం: ఉపాసన
This year is very special for Charan: Upasana ఈ ఏడాది చరణ్ కి చాలా ప్రత్యేకం: ఉపాసన
Advertisement
Ads by CJ

మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన హాలీవుడ్ అసోసిషియన్ అవార్డ్స్ వేడుకకి హాజరైనప్పటినుండి.. అందరి చూపు తన మీదే ఉండేలా చూసుకుంటున్నారు. డ్రెస్సింగ్ స్టయిల్, మీడియాతో ఇంటరాక్షన్ ఇలా అన్ని విషయాల్లో రామ్ చరణ్ స్పెషల్ గా కనిపించారు. ఇటు తండ్రవుతున్న  ఫీలింగ్, అటు కెరీర్ లో పాన్ ఇండియా స్టేటస్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రామ్ చరణ్ పై ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

తానెప్పుడూ తన భర్త వెన్నంటే ఉంటాను, అలాగే చరణ్ కూడా తన తోటే ఉంటాడంటూ ఉపాసన భర్త చరణ్ పై ప్రశంశల వర్షం కురిపించింది. నా లైఫ్ లో జరిగిన ప్రతి సంఘటనలో చరణ్ నాకు తోడుగా, సపోర్ట్ గా ఉన్నాడు. నేను కూడా చరణ్ కి అంతే మద్దతుగా నిలిచాను, ఆర్.ఆర్.ఆర్ లోని నాటు నాటు సాంగ్ కోసం ఉక్రెయిన్ వెళ్ళినప్పుడైనా, ఇంట్లో ఉన్నప్పుడైనా, అలాగే షూటింగ్స్ తో బిజీగా ఉంటున్నా నేను చరణ్ కి తోడుగానే ఉన్నాను, ఎలాంటి సమయంలోనైనా, సందర్భంలోనైనా, నేను చరణ్ కి హెల్ప్ చేస్తాను. 

చరణ్ కి 2023 ఎంతో ప్రత్యేకం. ఈ ఏడాది చరణ్ అనేక ప్రశంశలు అందుకున్నాడు. ఎంతో ఆనందంతో ఉన్నాడు. అలాగే వర్క్ పరంగాను చాలా హ్యాపీ గా ఉన్నాడు. ఈ ఏడాది చరణ్ దే అంటూ ఉపాసన భర్తపై తన ప్రేమని చూపించింది. ఉపాసన చెప్పినట్టుగా వర్క్ పరంగాను, ప్రశంశల పరంగాను, అటు తండ్రి కాబోతున్నందుకు నిజంగా ఈ ఏడాది చరణ్ కి ప్రత్యేమైన ఏడాది అనే చెప్పాలి.

This year is very special for Charan: Upasana:

Upasana Konidela on Success of Ram Charan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ