Advertisementt

పవన్ కి రీమేక్ లు బెటరేమో

Tue 07th Mar 2023 04:39 PM
pavan kalyan,sai tej  పవన్ కి రీమేక్ లు బెటరేమో
Are remakes better for Pawan? పవన్ కి రీమేక్ లు బెటరేమో
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయ్యాక వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రీమేక్స్ తో హిట్ కొట్టడమే కాదు.. షూటింగ్స్ కూడా చకచకా చేసేసారు. భీమ్లా నాయక్ కన్నా ముందే మొదలైన ఒరిజనల్ హరి హర వీరమల్లు షూటింగ్ ఇంతవరకు పూర్తికాలేదు. మరొకటి హారిష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఇక ఇప్పుడు దర్శకుడు సముద్ర ఖనితో తమిళ రీమేక్ మొదలవడమే కాదు.. చక చకా షూటింగ్ పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్.

మేనల్లుడు సాయి తేజ్ తో కలిసి పవన్ కళ్యాణ్ తమిళనాట హిట్ అయిన వినోదియం సిత్తం చిత్రం రీమేక్ చేస్తున్నారు. రెండు వారాల క్రితమే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూట్ యమా స్పీడుగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ ఈ రీమేక్ షూట్ పూర్తి చేసి హరి హర వీరమల్లు సెట్స్ లోకి వెళ్లాలనుకుంటున్నారట. అంటే పవన్ పార్ట్ 20 డేస్ పూర్తి కాగానే పవన్ వెళ్ళిపోతే.. మిగతాది సముద్రఖని పూర్తి చేసుకుని విడుదల చేసుకుంటారు. ఇక పవన్ మరో సినిమా షూటింగ్ కూల్ గా చేసుకుంటారు. 

సో ఇలా రీమేక్స్ అయితే పవన్ కళ్యాణ్ స్పీడుగా పూర్తి చేస్తారనిపిస్తుంది. అందుకే ఆయనకి రీమేక్స్ బెటర్ అంటున్నారు. భీమ్లా నాయక్ కూడా రానా తో కలిసి పవన్ త్వరగానే పూర్తి చేసేసారు. ఇప్పుడు సముద్ర ఖని మూవీ.. సో రీమేక్స్ అయితే టప టపా యాక్ట్ చేసేసి వెళ్ళిపోతారు. అదన్న మాట విషయం.

Are remakes better for Pawan?:

Pavan-Sai tej movie shooting update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ