ఫిబ్రవరిలో కాస్తో కూస్తో ప్రేక్షకులని అలరించే సినిమాలు విడుదలైనా.. గత రెండు వారాలుగా థియేటర్లలో పెద్దగా ఇంట్రెస్టింగ్ గా అనిపించే సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు. 10th, ఇంటర్ పరీక్షల సీజన్. పిల్లలంతా ఎగ్జామ్ మూడ్ లో ఉంటే.. పేరెంట్స్ ఎగ్జామ్ టెన్షన్ ని క్యారీ చేస్తారు కాబట్టి ఎలాగూ జనాలు కూడా థియేటర్లకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకోసమే మేకర్స్ కూడా వరసగా తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటిస్తున్నారు. గత ఏడాది ఈ సీజన్ లో కెజిఫ్, ఆర్.ఆర్.ఆర్ సినిమాల ప్రమోషన్స్ తో హీట్ మీదున్న ప్రేక్షకులని పెద్ద సినిమాలు ఊరించాయి.
కానీ పెద్ద సినిమాలు లేక ఈ ఏడాది ఈ సీజన్ లో ప్రేక్షకులు కూడా డల్ గా కనబడుతున్నారు. పెద్ద సినిమాలు అయితే జనాలు ఏదో ఒక రకంగా థియేటర్లకు వస్తారు. కానీ చిన్న సినిమాలకు మిడ్ రేంజ్ సినిమాలకు జనాలు థియేటర్లకు రావాలంటే సీజన్ కూడా సహకరించాలి.
అయితే ఓటీటీలో మాత్రం క్రేజీ మూవీస్ మరియు వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం కూడా సినిమాలు/ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ఆ లిస్ట్ ఒకసారి చూసేద్దాం.
ముందుగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు :
1) సి.ఎస్.ఐ సనాతన్ -మార్చి 10
2) ట్యాక్సీ-మార్చి 10
3) నేడే విడుదల- మార్చి 10
4) వాడు ఎవడు-మార్చి 10
ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సీరీస్ లు:
1) రానా నాయుడు-నెట్ ఫ్లిక్స్
2) యాంగర్ టేల్స్-డిస్నీ ప్లస్ హాట్ స్టార్
3) రన్ బేబీ రన్ (తెలుగు & తమిళ్ ) డిస్నీ ప్లస్ హాట్ స్టార్