కేరాఫ్ కంచెర పాలెం దర్శకుడు వెంకటేష్ మహా KGF సినిమాపై చేసిన ఇండైరెక్ట్ కామెంట్స్ తో కన్నడ అభిమానులు, యశ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు.. వెంకటేష్ మహా ఎక్కడకనిపిస్తే అక్కడ కొట్టేలా కనిపిస్తున్నారు. KGF చిత్రంపై వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ చూసిన వారు అతను అంత త్వరగా పాన్ ఇండియా లెవల్లో పాపులర్ అవుదామనుకున్నాడా అంటూ కోపం వెలిబుచ్చుతున్నారు. అందరికి నచ్చి, అన్ని కోట్లు కొల్లగొట్టిన చిత్రంపై నీ ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేస్తావా.. అది విని నందిని రెడ్డి, వివేక్ ఆత్రేయ లాంటి దర్శకులు పడి పడి నవ్వుతారా అంటూ సోషల్ మీడియాలో వెంకటేష్ మహాని ఏసుకుంటున్నారు.
నందిని రెడ్డి, వివేక్ ఆత్రేయలు అయితే ఒకడుగు వెనక్కి వేసి క్షమాపణలు చెప్పారు కానీ.. వెంకటేష్ మహా అసలు KGF పంటి చిత్రాల పేరు తియ్యకుండా తమ సినిమాని, దర్శక, హీరోలని అవమానించడం యశ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వ్యాప్తంగా #InsecureLoaferVenkateshMaha తో వెంకటేష్ మహాని అతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. Waiting for clown @mahaisnotanoun 🤡 to apologise #Yashboss n kgf team. వెంకటేష్ మహా యశ్ కి, KGF మేకర్స్ కి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
వెంకటేష్ మహా వారికి సారి చెప్పేవరకు యశ్ ఫాన్స్ నిద్రపోయేలా లేరు. లేదంటే సోషల్ మీడియాలో మరింత రచ్చ చేసినా చేస్తారు వారు. ఈ గొడవ ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.