Advertisementt

చాలారోజుల తర్వాత పూరి-ఛార్మి ఇలా..

Mon 06th Mar 2023 08:26 PM
puri jagannadh,charmi kaur  చాలారోజుల తర్వాత పూరి-ఛార్మి ఇలా..
Puri Jagannadh and Charmi Spotted At Airport చాలారోజుల తర్వాత పూరి-ఛార్మి ఇలా..
Advertisement
Ads by CJ

లైగర్ సినిమా షూటింగ్, అలాగే ప్రమోషన్స్, సినిమా రిలీజ్ టైమ్ లో పూరి జగన్నాథ్ ఇంకా ఛార్మి లు ముంబై టు హైదరాబాద్, హైదరాబాద్ టు ముంబై అంటూ ఎక్కే ఫ్లైట్ ఎక్కుతూ దిగే ఫ్లైట్ దిగుతూ ఎయిర్ పోర్ట్ లో సందడి చేసేవారు.. ఆ సినిమా కోసం ముంబైలోనే చాలారోజులు ఉండిపోయారు. కానీ లైగర్ ప్లాప్ తర్వాత పూరి జగన్నాథ్, ఛార్మీలు ఆఖరికి సోషల్ మీడియాకి కూడా గుడ్ బై చెప్పేసి కామ్ అయ్యారు. తర్వాత లైగర్ డిస్టిబ్యూటర్స్ తో గొడవ, అటు లైగర్ బడ్జెట్ విషయంలో ఈడీ విచారణ వీటితో పూరి, ఛార్మీలు బాగా సఫర్ అయ్యారు.

ఇక కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న పూరి, ఛార్మి లు నేడు ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. పూరి, ఛార్మీలు కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ చెకింగ్ లో ఫొటోలకి ఫోజులిచ్చారు. చాలారోజులు తర్వాత పూరి-ఛార్మీలు ఇలా కనిపించడంతో ఫోటో గ్రాఫర్స్ తమ కెమెరాలకు పని చెప్పారు. ఛార్మి ఇంకా పూరి నవ్వుతూ ఫొటోలకి ఫోజులిచ్చారు. పూరి జగన్నాథ్ లైగర్ తర్వాత చెయ్యాల్సిన జన గణ మన ప్రాజెక్ట్ ఆగిపోయింది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవిని ఇంప్రెస్స్ చేసే పనిలో పూరి ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది. అది చర్చల్లో ఉండగా.. ఇప్పుడు పూరి తదుపరి ప్రాజెక్ట్ పై అందరిలో ఇంట్రెస్ట్ కనిపిస్తుంది.

Puri Jagannadh and Charmi Spotted At Airport :

Puri Jagannadh and Charmi Kaur Spotted At Mumbai Airport

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ