Advertisementt

భార్యని ఎంకరేజ్ చేస్తున్న మంచు మనోజ్

Mon 06th Mar 2023 07:38 PM
manchu manoj,mounika reddy  భార్యని ఎంకరేజ్ చేస్తున్న మంచు మనోజ్
Manchu Manoj encouraging his wife Mounika భార్యని ఎంకరేజ్ చేస్తున్న మంచు మనోజ్
Advertisement
Ads by CJ

గత మూడు రోజులుగా మంచు మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడేమో అనే అనుమానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వేళ తాను ప్రస్తుతం వాట్ ద ఫిష్ మూవీ చేస్తున్నాను, ప్రజా సేవ చెయ్యాలనే కోరిక ఉంది కానీ.. రాజకీయాల్లోకి రావాలనే ఆశ లేదు అంటూ కుండబద్దలు కొట్టాడు మంచు మనోజ్. పొలిటికల్ ఫ్యామిలీ వారసురాలు మౌనిక రెడ్డిని ప్రేమ వివాహం చేసుకుని ఈరోజు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని సందర్శించుకున్న మంచు మనోజ్ రాజకీయాలపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 

మీడియా మిత్రులు కొంతమంది మనోజ్ ని.. పెళ్లి చేసుకున్నారు.. నెక్స్ట్ ఏమిటి అన్న ప్రశ్నకి మనోజ్ మాట్లాడుతూ.. సినిమాల నుండి గ్యాప్ తీసుకున్నాను, దేవుడి దయవల్ల కొత్త సినిమా మొదలు కాబోతుంది. రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్నకి నాకు ప్రజా సేవ చెయ్యాలని ఉంది, కానీ పాలిటిక్స్ లోకి రాను, నా భార్య మౌనిక రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉంటే సపోర్ట్ చేస్తాను. ఆమెతో ఉంటాను అంటూ మనోజ్ తన భార్య రాజకీయాల్లోకి వెళతానంటే తాను వెనకుంటాను అంటూ చెప్పాడు. మరి భూమా ఫ్యామిలీ బిగ్ బ్యాగ్రౌండ్ ఉన్న పొలిటికల్ ఫ్యామిలీ.

ఒకవేళ అక్క అఖిల ప్రియలాగా మౌనిక కూడా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయితే మనోజ్ భార్యని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడాడు.

Manchu Manoj encouraging his wife Mounika:

Manchu Manoj With His Wife Mounika Reddy 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ