Advertisementt

NTR30: జాన్వీకపూర్.. తుఫాన్‌‌లో నిశ్శబ్దం

Mon 13th Mar 2023 11:07 AM
janhvi kapoor,ntr 30,young tiger ntr,ntr30,heroine  NTR30: జాన్వీకపూర్.. తుఫాన్‌‌లో నిశ్శబ్దం
Janhvi Kapoor in NTR 30 NTR30: జాన్వీకపూర్.. తుఫాన్‌‌లో నిశ్శబ్దం
Advertisement
Ads by CJ

కొన్ని నెలలుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమాకు సంబంధించి రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన ‘NTR30’ చిత్రం అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆ విషయం సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి బాగా తెలుసు. అయితే సినిమా ప్రారంభం అనుకునే సమయానికి మళ్లీ తారకరత్న మృతి చెందడం, మరోసారి మూవీ ప్రారంభోత్సవం వాయిదా పడటం జరిగింది. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో కూడా ఎన్నో రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. వాస్తవానికి ఈ సినిమాలో అలియా భట్ నటించాలి. కానీ కుదరలేదు. ఇక అప్పటి నుంచి హీరోయిన్ల విషయంలో పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ సెలక్ట్ అయిందని, ఫొటోషూట్ కూడా పూర్తయిందనేలా వార్తలు వచ్చాయి. 

ఆ వార్తలను నిజం చేస్తూ.. అఫీషియల్‌గా మేకర్స్ జాన్వీనే ఈ సినిమాలో హీరోయిన్ అంటూ రివీల్ చేశారు. అంతేకాదు, అదిరిపోయే పోస్టర్ కూడా విడుదల చేశారు. జాన్వీ కపూర్ పుట్టినరోజును పురస్కరించుకుని యూనిట్ ‘NTR30’కి సంబంధించి ఆమె లుక్‌ను విడుదల చేశారు. ‘తుఫాన్‌లో నిశ్శబ్దం’ అంటూ మేకర్స్ వదిలిన ఈ పోస్టర్‌లో జాన్వీ కపూర్ చూడముచ్చటగా ఉంది. ‘తుఫాన్‌లో నిశ్శబ్దం’ క్యాప్షన్‌కు అనుగుణంగానే పోస్టర్‌లో కొండలు, సముద్రం చూపించారు. సముద్రపు అంచున కూర్చున్న జాన్వీ కపూర్ క్యూట్ లుక్‌తో ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. 

సినిమా విషయానికి వస్తే.. అతి త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ముచ్చట పూర్తవగానే.. ‘NTR30’ షూటింగ్‌ పూజా కార్యక్రమాలు జరిపి.. వెంటనే సెట్స్‌పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. 

Janhvi Kapoor in NTR 30:

Janhvi Kapoor Look in NTR 30 Revealed 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ