Advertisementt

భార్యని క్యూటీ అంటున్న అల్లు అర్జున్

Mon 06th Mar 2023 11:07 AM
allu arjun,sneha reddy  భార్యని క్యూటీ అంటున్న అల్లు అర్జున్
Allu Arjun whose wife is cutie భార్యని క్యూటీ అంటున్న అల్లు అర్జున్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్  అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డికి సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది. స్నేహ రెడ్డి హీరోయిన్స్ కే పోటీ ఇచ్చేలా స్టైలిష్ గా రెడీ అవడమే కాదు.. గ్లామర్ ఫోటో షూట్స్ తో మైమరపిస్తుంది. అల్లు అరవింద్ కోడలిగా, అల్లు అర్జున్ వైఫ్ గా, ఇద్దరు బిడ్డల తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని ఏర్పరుచుకున్న స్నేహ రెడ్డి-పుష్ప తో పాన్ ఇండియా స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ పెళ్లి రోజు నేడు.

మార్చ్ 6 న తమ పెళ్లి రోజుని పురస్కరించుకుని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా.. తన భార్య తో లవ్లీ సెల్ఫీని పోస్ట్ చేస్తూ భార్య స్నేహ రెడ్డికి Happy Anniversary Cutie 🖤 #AlluSnehaReddy అంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసాడు. అప్పుడప్పుడు భార్య పిల్లలతో విదేశీ ట్రిప్స్ వేసి ఎంజాయ్ చేసే అల్లు అర్జున్ రీసెంట్ గా తన ఫ్యామిలీ అంటే తల్లి-తండ్రి అరవింద్, అన్నా-వదిన, తమ్ముడి శిరీష్, భార్య స్నేహతో కలిసి దుబాయ్ ట్రిప్ వేసాడు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీ కాబోతున్న అల్లు అర్జున్.. ఈరోజు పెళ్లిరోజుని జరుపుకుంటున్నారు. మరి ఈ క్యూట్ అండ్ స్వీట్ కపుల్ కి సినీజోష్ టీమ్ తరపున పెళ్లి రోజు శుభాకాంక్షలు.

Allu Arjun whose wife is cutie:

Allu Arjun-Sneha Reddy wedding anniversary