మంచు మనోజ్ గత కొన్నాళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటున్నాడు. అటు పాలిటిక్స్ లోను యాక్టీవ్ గా లేడు. మధ్యలో పర్సనల్ ప్రోబ్లెంస్ తో సతమతమైన మంచు మనోజ్.. మొదటి భార్య ప్రణతితో మనస్పర్థలు, విడాకులు అంటూ ఇబ్బంది పడ్డాడు. అలాగే తండ్రి మోహన్ బాబుకి ఇష్టం లేకపోయినా.. పొలిటికల్ ఫ్యామిలీ అమ్మాయి భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లాడాడు. మంచు మనోజ్-మౌనికల వివాహం గత శుక్రవారమే హైదరాబాద్ లోని అక్క మంచు లక్ష్మి ఇంట్లో ఘనంగా జరిగింది. అయితే మంచు మనోజ్ పెళ్లి, దానికి సంబందించిన కార్యక్రమాలను పూర్తి చేసుకుని భార్య తో కలిసి కర్నూల్ వెళ్ళాడు.
ఏదో సెలెబ్రిటీలా కాకుండా ఓ పొలిటికల్ లీడర్ లా మంది మార్బలం అంటూ మనోజ్ భారీ కాన్వాయ్ తో కర్నూలుకి వెళ్ళాడు. అక్కడ కూడా భారీగా టపాసులు పేలుస్తూ చుట్టూ జనంతో మంచు మనోజ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యేందుకు రంగ సిద్ధం చేసుకుంటున్నాడా అనిపించేలా ఉంది వ్యవహారం.. భార్య మౌనిక కొడుకుని వదలకుండా మనోజ్ చెయ్యి పట్టుకుని నడిపించిన తీరు ఆకట్టుకుంది. ఇక మౌనిక తాతగారి బ్లెస్సింగ్స్ తీసుకుని అక్కడినుండి అత్తమామల సమాధుల దగ్గర నివాళులు అర్పించారు.
అయితే మంచు మనోజ్ ఇప్పుడు కొత్తగా సినిమా చేస్తున్నాడు. దానితో పాటుగా పాలిటిక్స్ లోకి కూడా ఎమన్నా ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నాడేమో అనిపించేలా అతని కర్నూల్ పర్యటన ఉండడంతో.. అందరూ అదే అనుకుంటున్నారు. లేదంటే అత్తగారింటికి అంత హడావిడి ఎందుకు అనేది నెటిజెన్స్ ఉద్దేశ్యం. మరి మంచు మనోజ్ అత్తగారి ఫ్యామిలీ నుండి ఎమన్నా పోటీ చేసే అవకాశం ఉందేమో చూడాలి. ఎలాగూ మౌనిక అక్క అఖిల ప్రియా తల్లి, తండ్రి వారసత్వాన్ని నడిపిస్తుంది. ఆమెకి తోడుగా మనోజ్ కూడా ఉంటాడేమో అనేది అందరిలో మొదలైన అనుమానం.