Advertisementt

ఏమున్నాడ్రా బాబు..

Sun 05th Mar 2023 09:23 PM
mahesh,sania mirza  ఏమున్నాడ్రా బాబు..
Mahesh stylish look in Sania Mirza party ఏమున్నాడ్రా బాబు..
Advertisement
Ads by CJ

నిజంగా సూపర్ స్టార్ మహేష్ ని చూస్తే అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకి కుళ్ళే, ఆయన అందం చూస్తే నిజంగా అమ్మాయిలు ఇప్పటికీ పడి సచ్చిపోతారు. 40 ప్లస్ లోను అదే 25 ఏళ్ళ అందం, అదే ఫిట్ మెస్ తో మెరిసిపోయే మహెష్ ని ఎలాంటి లుక్ లో చూసిన ఏమున్నాడ్రా బాబు అనాల్సిందే. తాజాగా మహేష్ బాబు సిక్స్ ప్యాక్ కోసం జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న పిక్ ని వదిలాడు. ఫిట్ గా ఉండేందుకు మహేష్ చాలా కష్టపడతాడు. అయితే త్రివిక్రమ్ SSMB28 సినిమా కోసం మహేష్ కొత్తగా మేకోవర్ అవుతున్నాడా.. లేదంటే రాజమౌళి సినిమా కోసమో అర్ధం కాక ఫాన్స్ జుట్టు పీక్కుంటున్నారు.

ఇక మహేష్ తాజాగా భార్య నమ్రతతో కలిసి సానియా మీర్జా పార్టీకి హాజరయ్యాడు. టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా నేడు LB స్టేడియం లో తన ఫేర్ వెల్ మ్యాచ్ తో టెన్నిస్ కి గుడ్ బై చెప్పగా.. తన గుడ్ బై సందర్భంగా ఈరోజు నైట్ ఏర్పాటు చేసిన పార్టీకి టాలీవుడ్ సెలబ్రిటీస్ ని ఆహ్వానించింది. ఈ పార్టీకి మహేష్ తన భార్య నమ్రతతో సూపర్ స్టైలిష్ అనాలో.. హ్యాండ్ సమ్ లుక్స్ అనాలో ఏమని వర్ణించను నీ అందం అంటూ మహేష్ లుక్ పై మహేష్ ఫాన్స్ అనేకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 

భార్య నమ్రతతో కలిసి ఫోటో గ్రాఫర్స్ కి మహేష్ ఫోజులిచ్చిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆ పిక్స్ చూసిన నెటిజెన్స్.. ఇందుకే కదయ్యా నీకు ఫ్యాన్ అయ్యేది, ఏమున్నాడ్రా బాబు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Mahesh stylish look in Sania Mirza party:

Mahesh and Namrata at Sania Mirza party

Tags:   MAHESH, SANIA MIRZA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ