యంగ్ టైగర్ NTR30 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆయన ఫాన్స్ ఎదురు చూడని రోజు లేదు, నిమిషం లేదు. కానీ ఒక ఏడాదిగా ఎన్టీఆర్ కొత్త చిత్రం లేట్ అవుతూనే ఉంది. వాళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నారో అది అంతగా లేట్ అవుతుంది. అయితే మొన్న ఫిబ్రవరి 24 న మొదలు కావల్సిన ఈ క్రేజీ పాన్ ఇండియా ఫిల్మ్ తారకరత్న మరణముతో పోస్ట్ పోన్ అయ్యింది. అయితే మార్చ్ 15న NTR30 గ్రాండ్ ఓపెనింగ్ అనే న్యూస్ చూసాం. అందులో నిజమెంతుందో కానీ.. ఇప్పుడు మార్చ్ 6న NTR30 హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరుని ప్రకటించబోతున్నారని తెలుస్తుంది.
మార్చ్ 6 జాన్వీ బర్త్ డే. సో ఆమెకి NTR30 లోకి వెల్ కమ్ చెబుతూ ఓ పోస్టర్ వదలబోతున్నారట మేకర్స్. అది రేపు 11.30 నిమిషాలకే అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో కొద్దిగా హడావిడి చేస్తున్నారు. ఈలోపులో NTR30 పై క్రేజీ న్యూస్ అంటూ.. ఎన్టీఆర్-కొరటాల కలయికలో తెరకెక్కబోయే మూవీ కోసం హాలివుడ్ నుండి స్టంట్ మేన్ అండ్ టెక్నీషియన్స్ దిగుతున్నారని కొంతమంది సోషల్ మీడియాలో ట్వీట్స్ మొదలు పెట్టారు. అయితే ఈ న్యూస్ లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.
ఇక ఈ చిత్రం మార్చ్ 20 నుండి హైదరాబాద్ లోనే రెగ్యులర్ షూట్ మొదలు పెట్టుకోబోతుందట. స్పెషల్ గా వేసిన సముద్ర సెట్ లోనే మొదటి షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణకు కొరటాల ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.