Advertisementt

జిమ్ లో రవితేజ లుక్ పై ఫాన్స్ ఇలా..

Sun 05th Mar 2023 12:56 PM
ravi teja,ravi teja gym look  జిమ్ లో రవితేజ లుక్ పై ఫాన్స్ ఇలా..
Fans like Ravi Teja look in the gym.. జిమ్ లో రవితేజ లుక్ పై ఫాన్స్ ఇలా..
Advertisement
Ads by CJ

మాస్ మహారాజ రవితేజ గత కొద్దిరోజులుగా లుక్ విషయంలో ఫాన్స్ ని బాగా డిస్పాయింట్ చేస్తున్నాడు. గత ఏడాది ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాల డిజాస్టర్స్ తో డల్ అయిన రవితేజ ధమాకా టాక్ తోనే మోత మోగించాడు. ధమాకా టాక్ కి కలెక్షన్స్ కి సంబంధం లేకుండా కలెక్షన్స్ మోత మోగించింది. ఆ వెంటనే 20 రోజుల్లో మెగాస్టార్ చిరు తో కలిసి వాల్తేర్ వీరయ్య హిట్ అందుకున్న రవితేజ డిమాండ్ బాగా పెరిగినా, లేదంటే పెంచినా.. ఆయన లుక్ విషయంలో  మాత్రం నెగటివ్ కామెంట్స్ మాత్రమే వస్తున్నాయి. బరువు తగ్గేందుకు వర్కౌట్స్ చేస్తూ జిమ్ లో కష్టపడుతున్నాడు ఓకె. కానీ మొహంలో కళ లేదు, గ్లో లేదు. మరీ ఆయన వయసు ఛాయలు కనిపించేలా ఉంటుంది లుక్.

క్రాక్ సినిమాలో రవితేజ లుక్ విషయంలో ఫాన్స్ ఫిదా అయినా, ఖిలాడీ, రామ రావు ఆన్ డ్యూటీ, ధమాకా, వాల్తేర్ వీరయ్య సినిమాల్లో ఆయన లుక్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. రవితేజ మొహంలో కాస్త కళ కావాలంటున్నారు. మరి బరువు తగ్గే ప్రాసెస్ లో రవితేజ ఇలా పేస్ లో గ్లో పోగొట్టుకోవడం ఫాన్స్ కే ఇష్టం లేదు. తాజాగా రవితేజ జిమ్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. జిమ్ లో రవితేజ వర్కౌట్స్ చేస్తూ కష్టపడుతున్న పిక్ చూస్తే ఆయన మోహంలో కాస్త కళ కనిపించింది,.

దానితో రవితేజని మళ్ళీ మాములుగా చూస్తున్నామంటూ ఆయన ఫాన్స్ హ్యాపీ గా ఫీలవుతున్నారు. లేదంటే ఆయన ఇక మీదట ఎలా ఉంటారో అని భయపడ్డారు వారు. రవితేజ లేటెస్ట్ మూవీ రావణాసుర విడుదలకు సిద్ధమవుతుండగా.. రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ టైగర్ నాగేశ్వరరావు చివరి షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా వుంది.

Fans like Ravi Teja look in the gym..:

Ravi Teja gym look goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ