Advertisementt

సిద్దార్థ్ తో లవ్: అదితి రావు కామెంట్స్

Sun 05th Mar 2023 10:52 AM
siddharth,aditi rao  సిద్దార్థ్ తో లవ్: అదితి రావు కామెంట్స్
In love with actor Siddharth? Actress Aditi Rao Open Talk! సిద్దార్థ్ తో లవ్: అదితి రావు కామెంట్స్
Advertisement
Ads by CJ

హీరో సిద్దార్థ్-అదితి రావు లు ప్రేమలో ఉన్నారనే ముచ్చట గత ఏడాదిన్నరగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడమే కాదు.. సిద్దార్థ్-అదితిలు సీక్రెట్ గా డేటింగ్ చేస్తూ లంచ్ పార్టీ లు, రెస్టారెంట్స్ అంటూ తెగ తిరుగుతున్నారు. వీళ్ళు తిరిగితే తప్పులేదు.. ఫోటో గ్రాఫర్స్ ఫోటోలు తీస్తే మాత్రం వీరికి తెగ కోపమొచ్చేసి వాళ్లపై ఎగురుతారు. ఇక వీరు జంట పక్షుల్లా కొన్నాళ్లుగా మీడియాకి ఎక్స్ పోజ్ కూడా అవుతున్నారు. కలిసి సోషల్ మీడియాలో డాన్స్ చేస్తూ అద్భుతంగా అదరగొట్టేస్తారు. కానీ ప్రేమ విషయం మాత్రం బయటపెట్టరు. 

అయితే తాజాగా అదితి రావు సిద్దార్థ్ తో లవ్ విషయంలో కాస్త వెటకారంగా స్పందించింది. నేను ఎవరితో రిలేషన్ లో ఉన్నాను అనే విషయం పక్కనబెట్టి నా సినిమాల గురించి మట్లాడుకోండి, అలా అయితేనే బావుంటుంది. ప్రస్తుతం నేను పలు ప్రాజెక్టులతో బిజీగా వున్నాను. మంచి డైరెక్టర్స్ తో కలిసి సినిమాలు చేస్తున్నాను, ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాలపైనే. నన్ను నటిగా అంగీకరించినంతవరకు నేను సినిమాల్లోనే కొనసాగుతాను, నటిస్తాను.

దయచేసి నా పర్సనల్ విషయాలను పక్కనబెట్టి.. నా కెరీర్ గురించి మట్లాడుకోండి అంటూ అదితి రావు.. సిద్దార్థ్ తో తన రిలేషన్ పై ఇండైరెక్ట్ గానే మా రిలేషన్ విషయాన్ని ఇంకెవరు మాట్లాడొద్దని తెగేసి చెప్పేసింది.

In love with actor Siddharth? Actress Aditi Rao Open Talk!:

Love with Siddharth: Aditi Rao comments

Tags:   SIDDHARTH, ADITI RAO
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ