పెళ్ళికి ముందైనా, పెళ్లి తర్వాత అయినా హీరోయిన్స్ ఒకేలా బిహేవ్ చేస్తారు. పెళ్ళికి ముందు కన్నా పెళ్లి తర్వాత మరింత గ్లామర్ షో చేస్తూ ఉంటారు. ఎందుకంటే తమ క్రేజ్ ఎక్కడ తగ్గిపోతుందో అనే భయం. రీసెంట్ గా బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకున్న గ్లామర్ బ్యూటీ కియారా అద్వానీ.. ఓ పది రోజుల గ్యాప్ తో మళ్ళీ రొటీన్ లైఫ్ లోకి వచ్చేసింది. తన సినిమా షూటింగ్స్, అలాగే తన యాడ్ షూట్స్ అంటూ పనిలో పడింది.
తాజాగా ముంబాయిలోని డివై పాటిల్ స్టేడియంలో శనివారం సాయంత్రం జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపిఎల్) 2023లో కియారా గ్లామర్ ట్రీట్ అదిరిపోయింది. పింక్ బాడీకాన్ డ్రెస్, సిల్వర్ కలర్ షూ ధరించిన కియారా అందాలు గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. టునైట్ ఐయామ్ ఫీలింగ్ పింక్ అంటూ కియారా ఇన్స్టాలో ఫొటోస్ ని షేర్ చేసింది. కియారా పెళ్లి తర్వాత మరింత ఘాటైన గ్లామర్ షో చేస్తుందిగా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.