సమంత కి టాలీవుడ్ లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. శిల్పా రెడ్డి, రాహుల్ వైఫ్ చిన్మయి, నందిని రెడ్డి ఇలా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాగ చైతన్య తో పెళ్లి, అలాగే వివాహ బందంలోనూ ఫ్రెండ్స్ తో ఉన్న సమంత.. నాగ చైతన్య తో విడాకుల తర్వాత ఆ స్నేహితుల వలనే కొంతలో కొంత కోలుకుంది. వాళ్లతో కలిసి ముఖ్యంగా శిల్పా రెడ్డితో కలిసి ఆధ్యాత్మికంగా సమంత తీర్థ యాత్రలు చేసింది. అయితే ఈరోజు నందిని రెడ్డి పుట్టిన రోజు. నందిని రెడ్డి తో సమంత రెండు మూవీస్ చేసింది. అందులో జబర్దస్త్ ప్లాప్ కాగా.. ఓ బేబీ హిట్ అయ్యింది.
ఇక నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న తన ఫ్రెండ్ నందిని రెడ్డిని సమంత చాలా స్పెషల్ గా విషెస్ చెప్పింది. ప్రతి ఒక్కరి లైఫ్ లో నీలాంటి ఫ్రెండ్ ఒకరుండాలి. ఎలాంటి బాధలు ఎప్పుడూ దగ్గరకి రానివ్వరు. బాధ పడుతున్న సమయంలోనూ నవ్విస్తుంటావ్. ఎప్పుడూ హ్యాపీ గా ఉంచేందుకు ప్రయత్నిస్తావ్. నువ్వు లేకుండా నేనేం చేయగలను. లవ్యూ.. హ్యాపీ బర్త్ డే అంటూ సమంత నందిని రెడ్డికి విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్ తో పాటుగా నందిని రెడ్డి తో కలిసి ఉన్న పిక్ ని పోస్ట్ చేసింది.