మంచు మనోజ్ రెండోసారి పెళ్లిపీటలెక్కాడు. తండ్రి మోహన్ బాబుకి, అన్న విష్ణుకి మౌనిక రెడ్డితో మనోజ్ పెళ్లి ఇష్టం లేకపోయినా.. అక్క మంచు లక్ష్మి సపోర్ట్ తో మనోజ్, భూమా మౌనిక మెడలో మూడు ముళ్ళు వేసాడు. తండ్రి, అన్న వచ్చి ఆశీర్వదించినప్పటికీ.. మనోజ్ పెళ్లి విషయంలో మంచు లక్ష్మి అన్ని బాధ్యతలను తీసుకుంది. మనోజ్ అంటే లక్ష్మికి ప్రాణం. అందుకే సంగీత్, మెహిందీ, పెళ్లి కొడుకు ఫంక్షన్ ఇలా ప్రతి ఒక్క విషయంలో మంచు లక్ష్మి తమ్ముడికి చెయ్యాల్సిన ప్రతి ముచ్చట నెరవేర్చింది. పెళ్లి కూడా తన ఇంట్లోనే ఏర్పాటు చేసింది.
అయితే మంచు మనోజ్ తన అక్క తనకి చేసిన సపోర్ట్ కి, పెళ్లి పనులన్నిటి కలిపి థాంక్స్ చెప్పడమే కాదు.. కాస్త ఎమోషనల్ అయ్యాడు. అతని అక్క మంచు లక్ష్మి తనని పెళ్లి కొడుకుని చేస్తూ ఉన్న పిక్ ని షేర్ చేస్తూ.. అక్క ఏ జన్మ పుణ్యమో.. థాంక్స్ ఫర్ ఎవ్రిథింగ్.. లవ్ యు అక్కా అంటూ మంచు మనోజ్ అక్కకి కృతజ్ఞతలు చెబుతూ ఎమోషన్ అవుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక మనోజ్ పెళ్లి మంచు, భూమా కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్యన అంగరంగ వైభవంగా జరిగిపోయింది.