అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ఏజెంట్.. ఏప్రిల్ చివరి వారంలో విడుదలకాబోతుంది. ఈ చిత్రం అనేక రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ చివరికి ఏప్రిల్ 28న డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే ఈపాటికే షూటింగ్ కంప్లీట్ అయ్యి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అలాగే ప్రమోషన్స్ మొదలు పెట్టేసుకుంటుంది అనుకున్నారు ఫాన్స్. ఎందుకంటే ఏజెంట్ మూవీని పాన్ ఇండియా మార్కెట్ లోకి వదులుతున్నారు. అంటే ప్రమోషన్స్ కి చాలా సమయం కావాలి. అందుకే ఏజెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది అనుకున్నారు.
కానీ ఏజెంట్ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదని, ప్రస్తుతం ఏజెంట్ షూటింగ్ మస్కట్ లో ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది అని ఈ శనివారం అఖిల్ బెంగళూరు కి CCL మ్యాచ్ నిమిత్తం రానున్నాడని నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేసారు. మరి అఖిల్ CCL మ్యాచెస్ లో దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. ఇటు క్రికెట్, అటు షూటింగ్ అంటూ అఖిల్ చాలా కష్టపడుతున్నాడు. ఈపాటికి సురేందర్ రెడ్డి ఏజెంట్ కంప్లీట్ చేసేసి ఉంటే.. అఖిల్ ఇంకాస్త కూల్ గా క్రికెట్ లో పార్టిసిపేట్ చేసేవాడు. కానీ అలా కాకుండా అఖిల్ ఇటు క్రికెట్ అటు షూటింగ్స్ అంటూ పరుగులు పెడుతున్నాడు.
ఈమధ్యనే సాక్షి వైదే తో కలిసి వదిలిన డ్యూయెట్ కి మంచి రెస్పాన్స్ దక్కగా.. అఖిల్ మేకోవర్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఎప్పుడెప్పుడా అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీ పెరఫార్మెన్స్ చూస్తామా అని అభిమానులతో పాటుగా ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.