గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జరిగిన అవమానం, ఆయనకి జరుగుతున్న అన్యాయం పైనే చర్చ జరుగుతుంది. నందమూరి ఫ్యామిలీ నుండి ఎన్టీఆర్ కి ఎదురవుతున్న పరిస్థితికి ఎన్టీఆర్ ఫాన్స్ చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ ఎన్టీఆర్ ని పట్టించుకోకపోవడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అంత పెద్ద నటుడు, ఆఖరికి అమెరికాకి అవార్డు అందుకోవడానికి అక్కడికి వెళ్లకుండా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తే.. ఇక్కడ మాత్రం ఎన్టీఆర్ ని ఎవరూ పట్టించుకోకపోయేసరికి ఎన్టీఆర్ ఫాన్స్ బగా ఫీలవుతున్నారు.
దానితో ఆయన ఫాన్స్ అన్నా మీకు ఎవ్వరు తోడుగా ఉన్నా లేకపోయినా మేమున్నాము, మాటాయిస్తున్నాం #NTR అన్నా నీతో ఎవ్వరు ఉన్నా లేకున్నా నీకు మేము ఉన్నాము. మా ప్రాణం పోయే చివరివరకు నీతోనే ఉంటాం, మరో జన్మంటూ ఉంటే కూడా నీ అభిమానిగా పుట్టాలని ఆ దేవుడికీ కోరుతున్నాం. 🤗💪
#తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం✌️ పెద్దాయన బిడ్డల మీద గౌరవం ఎప్పటికీ పోవు 💯 కానీ ఒకరి పక్కనే నిలబడాలి అనే టైమ్ వస్తె సెకండ్ కూడా ఆలోచించకుండా నిలబడేది మాత్రం మా తారక రాముడు @tarak9999 వైపే 👍అంటూ ట్వీట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు.
మీ తండ్రిగారు హరికృష్ణ గారు బ్రతికుంటే ఇలాంటివి చూసేవాళ్ళం కాదు. పరిస్థితి మరోలా ఉండేది.. అంటూ కంటతడిపెడుతూ వారు ఎన్టీఆర్ కి అండగా నిలుస్తున్నారు. ఆనందాన్ని పంచుకుని సెలెబ్రేషన్స్ చేసుకోవడమే కాదు.. వారిలోని బాధని పంచుకొని.. వారికి అండగా నిలిచేదే అసలైన అభిమానం.