మంచు మనోజ్.. భూమా మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లాడాడు. గతంలో మనోజ్ ప్రేమ పెళ్లి.. విడాకులు కాగా.. ఇప్పుడు మౌనికని మనోజ్ రెండో వివాహం చేసుకున్నాడు. అక్క మంచు లక్ష్మి ఇంట్లో అంగరంగ వైభవంగా మంచు మనోజ్ రెండో పెళ్లి నిన్న శుక్రవారం రాత్రి జరిగిపోయింది. భూమా మౌనిక మెడలో మనోజ్ మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచాడు. కొద్దిమంది బంధువులు, సన్నిహితులు, స్నేహితులు హాజరైన ఈపెళ్లికి మంచు మోహన్ బాబు వస్తారా అనే సందిగ్ధం నడిచింది. ఎందుకంటే మంచు మనోజ్ పెళ్లి సంబరాలు మొదలైనప్పటినుండి మంచు మోహన్ బాబు గారు కానీ, అన్న విష్ణు ఊసు లేదు, పెళ్లి పనులని మోహన్ బాబు ఇంట్లో కాకుండా మంచు లక్ష్మి ఇంట్లో జరగడమే అనేక అనుమానాలకు తావిచ్చింది.
కానీ మనోజ్ పెళ్ళికి మోహన్ బాబు, విష్ణులు సతి సమేతులుగా హాజరయ్యి కొత్త జంటని ఆశీర్వదించారు. మనోజ్ ఇంకా మౌనికలని మోహన్ బాబు ఆశీర్వదిస్తున్న పిక్స్ వైరల్ అయ్యాయి. మంచు మనోజ్ అంటే తన అక్కకి ఎంతో ఇష్టం. అందుకే మనోజ్ పెళ్లి పనులన్నీ ఆమె దగ్గరుండి చూసుకుంది. మెహిందీ, అలాగే సంగీత్ ఫంక్షన్స్, ఇంకా పెళ్లి అన్ని లక్ష్మి చేతుల మీదుగానే జరిగినట్టుగా కనిపించాయి. మంచు విష్ణు ఆయన భార్య విరోనికా కూడా ఈ పెళ్లి వేడుకలకి దూరంగానే ఉన్నారు. కానీ పెళ్లి సమయానికి మంచు ఫ్యామిలీ మొత్తం ఒకే చోట చేరి నూతన వధూవరులని శీర్వదించారు.
భూమా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ ఇంకా కొంతమంది బంధువుల మధ్యన మనోజ్ పెళ్లి జరిగిపోయింది. ఈ పెళ్ళికి సినీ ఇండస్ట్రీ నుండి పెద్దగా సెలబ్రిటీస్ కూడా హాజరుకాలేదు. ఒక్క శిల్ప రెడ్డి తప్ప. మనోజ్ మంగళ స్నానాల దగ్గరనుండి పెళ్లి కొడుకుని చేసే వరకు అన్ని బాధ్యతలు మంచు లక్ష్మినే తీసుకుంది.