Advertisementt

పెళ్లిపై ఎలాంటి డ్రీమ్స్ లేవంటుంది

Fri 03rd Mar 2023 09:31 PM
lavanya tripathi  పెళ్లిపై ఎలాంటి డ్రీమ్స్ లేవంటుంది
No dreams about marriage పెళ్లిపై ఎలాంటి డ్రీమ్స్ లేవంటుంది
Advertisement
Ads by CJ

చాలామంది అమ్మాయిలు తనకి కాబోయే భర్త అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆరడుగులు ఎత్తుండాలి, అందమైనవాడు, అందులోను మంచి మనసు కలిగిన వాడు కావాలంటూ కలలు కంటారు. ఇది చాలా సహజం. కానీ నటి లావణ్య త్రిపాఠి మాత్రం తనకి పెళ్లి సంబంచిన కలలేమి లేవని తేల్చేసింది. మెగా హీరో వరుణ్ తేజ్ తో లవ్ లో ఉంది, త్వరలోనే వరుణ్ తేజ్ తో లావణ్య మూడు ముళ్ళు వేయించుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఎప్పటినుండో ఉంది.

ఈమధ్యన నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లి అన్నప్పుడు కూడా అందరూ నాగబాబు కోడలిగా లావణ్య త్రిపాఠిని ఫిక్స్ అయ్యారు. అటు లావణ్య త్రిపాఠి కూడా ఇండైరెక్ట్ సిగ్నల్స్ తో వరుణ్ పేరు చెబుతూ ఉండడంతో చాలామంది అది నిజమనుకుంటున్నారు. అయితే ఈమధ్యన సినిమా అవకాశాలు తగ్గడంతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠికి ఓ ఇంటర్వ్యూలో ఆమె పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దానితో లావణ్య ఒకింత విసురుగానే.. ప్రతి ఒక్కరూ తన పెళ్లి గురించే మాట్లాడుతున్నారని, టైమ్ వచ్చినప్పుడు పెళ్లి అదే జరుగుతుందని చెప్పింది.

తన పేరెంట్స్ తన పెళ్లి విషయంలో ఎలాంటి ఒత్తిడి చెయ్యడం లేదు అని, తాను కూడా ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించడం లేదని, పెళ్లికి సంబంధించిన ఎలాంటి డ్రీమ్స్ తనకు లేవని చెప్పిన ఆమె ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే అంటూ ఎప్పటిలాగే పాట పాడింది. పెళ్లి మీద తనకు నమ్మకం ఉందని.. నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి జరుగుతుందని చెప్పింది. వ్యక్తిగత విషయాల గురించి అందరితో షేర్ చేసుకోవడం తనకు ఇష్టం ఉండదని చెప్పుకొచ్చింది.

No dreams about marriage:

No dreams about marriage: Lavanya Tripathi

Tags:   LAVANYA TRIPATHI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ