ఈటీవీలో వారానికి రెండు రోజులు ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ రెండు షోస్ ఈటివి కి బలం. ఏ ఛానల్ లో ఎలాంటి షో వచ్చినా జబర్దస్త్ కి పోటీగా నిలవలేకపోయేది. కామెడీ షోలకే రారాజు జబర్దస్త్ అన్న రేంజ్ లో ఓ వెలుగు వెలిగింది.. అందులో కామెడీ చేసే కమెడియన్స్ ని పక్క ఛానల్ వాళ్ళు లాగెయ్యడానికి చాలా ప్రయత్నాలు జరిగేవి. అలాంటి టాప్ కామెడీ షో ఇప్పుడు మసకబారింది. దానికి కారణాలు ఎన్నో. టాప్ యాంకర్ అనసూయ తప్పుకోవడం, సుధీర్ లాంటి టాప్ కమెడియన్స్ వెళ్లిపోయారు.
ఆది, శ్రీనులు అప్పుడప్పుడు గ్యాప్ తీసుకోవడం, కామెడీ అంతగా పండకపోవడం, బలమైన స్కిట్స్ లేకపోవడం, రోజా లాంటి జెడ్జ్ తప్పుకోవడం.. చిన్న చితక కమెడియన్స్ తో స్కిట్స్ లాగించెయ్యడం ఇలా జబర్దస్త్ మసకబారడానికి కారణాలు. తాజాగా జబర్దస్త్ కి టీఆర్పీ తగ్గిపోయింది అంటూ పంచ్ ప్రసాద్ చేసిన సంచలన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన ఆరోగ్యంపై పెదవి విప్పిన పంచ్ ప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ టీఆర్పీ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.
ఒకప్పుడు జబర్దస్త్ కి విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ క్రేజ్, హైప్ లేవు. గతంలో సూపర్ టీఆర్పీ తో జబర్దస్త్ నెంబర్ 1 ప్లేస్ లో ఉండేది. ఈమధ్యన జబర్దస్త్ కి అంతగా టీఆర్పీ రేటింగ్ రావడం లేదు అంటూ పంచ్ ప్రసాద్ జబర్దస్త్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.